మంత్రులు మందు కొట్టి సభకు వచ్చారు: హరీష్‌రావు
తెలంగాణ అసెంబ్లీలో అధికార-విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు.
తెలంగాణ అసెంబ్లీలో అధికార-విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. మీరు మందు కొట్టి సభకు వచ్చారు.. అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించగా.. కాళేశ్వరంలో హరీష్‌రావు 10 కోట్ల రూపాయల వరకు నొక్కేశారని.. ఆయనకు బేడీ లు వేసేందుకు త్వరలోనే పోలీసులు ఇంటి తలుపు తడతారని.. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యా నించారు. దీంతో సభలో ఇరు పక్షాల మధ్య తీవ్రస్థాయిలో రగడ చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
బుధవారం సభ ప్రారంభం అవుతూనే.. రహదారుల నిర్మాణాలు.. ప్రాజెక్టులపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏడాది పాలనలో ఒక్క రోడ్డును కూడా నిర్మించ లేదని.. దీనికి కమీషన్లు సరిగా లేకపోవడమే కారణమని విమర్శించారు. ప్రాజెక్టులను పట్టించుకోకుండా.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని నిప్పులు చెరిఆరు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న మంత్రి కోమటి రెడ్డి పదేళ్ల పాలనలో బీఆర్ ఎస్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
రహదారులను ఏనాడైనా పట్టించుకున్నారా? అని కోమటి రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని.. కోట్ల రూపాలయ సొమ్ము చేతులు మారిందని అన్నారు. 10 కోట్ల రూపాయలు హరీష్ రావు నొక్కేశారని వ్యాఖ్యానించారు. త్వరలోనే పోలీసులు ఆయన ఇంటి తలుపుతట్టనున్నారని.. చేతులకు బేడీలు వేసీ తీసుకువెళ్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
మాజీ మంత్రి హరీష్ రావు జోక్యంచేసుకుని.. కాంగ్రెస్ సభ్యులు పొద్దున్నే మందు కొట్టి సభకు వచ్చారని.. సభలో కూడా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అమలు చేయాలని బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేయాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కాపాడిందని.. భూములను కూడా కాపాడిందని చెప్పుకొచ్చారు. తనపై చేసిన ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి నిరూపించాలని సవాల్ రువ్వారు. దీనికి కోమటిరెడ్డి స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలను ప్రతి అక్షరం నిరూపిస్తానని ప్రతిసవాల్ చేశారు.