పవర్ చూపిస్తానన్న కౌశిక్.. మద్దతుగా రంగంలోకి హరీశ్.. హీటెక్కిన పాలిటిక్స్

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానలా తయారైంది.

Update: 2024-09-12 09:30 GMT

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానలా తయారైంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో మొదలైన రాజకీయ విమర్శలు.. ఏకంగా యుద్ధ వాతావరణానికి దారితీశాయి. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం రచ్చగా మారింది. కౌశిక్ రెడ్డి సవాల్‌తో గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి గాంధీ కొండాపూర్‌లోని కౌశిక్ ఇంటికి చేరుకున్నారు. ‘దమ్ముంటే కౌశిక్ రెడ్డి బయటకు రావాలి’ అంటూ సవాల్ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు చివరకు గాంధీని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఈ ఘటనలపై కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. తన ఇంటిపై గాంధీ అనుచరులు దాడి చేయడాన్ని ఖండిస్తూ.. కౌశిక్ రెడ్డి నాన్ లోకల్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ‘మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక పీకలేకపోయారు. తెలంగాణ బిడ్డలం. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు దాడి చేస్తే భయపడేటోడు ఎవడూ లేడు. రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇటు హరీశ్ రావు స్పందిస్తూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌పై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడం లేదన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా అని నిలదీశారు. గాంధీ, ఆయన గూండాలపై హత్యానేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News