వీడియో : దుబాయ్ కి ఎంత పెద్ద కష్టం!
ఎడారి దేశం సౌదీ అరేబియా వణికిపోయింది. గాలివాన బీభత్సానికి అతలాకుతలం అయింది.
ఎడారి దేశం సౌదీ అరేబియా వణికిపోయింది. గాలివాన బీభత్సానికి అతలాకుతలం అయింది. మంగళవారం వీచిన గాలులకు చాలా ప్రాంతాలు స్తంభించాయి. జనజీవనం భయపడింది. కొన్ని గంటల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దుబాయి జలమయమైంది. ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి.
దుబాయి విమానాశ్రయం రన్ వే పై నీరు చేరడంతో విమాన రాకపోకలు సాగలేదు. ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. రన్ వేపై మోకాలి లోతు నీరు నిలవడంతో విమానాలు నిలిచిపోయాయి. యూఏఈ, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా దేశాలు తుఫాన్ ధాటికి గజగజ వణికాయి. వాతావరణ మార్పులతో ఇలాంటి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు.
అమెరికా, టోక్యో, జపాన్ లాంటి దేశాల్లో తుఫాన్లు ప్రమాదం తీసుకొస్తూనే ఉంటాయి. అలాంటి తుఫాన్ మంగళవారం అరబ్ దేశాలను ఆగం చేసింది. ప్రజలు రోడ్ల మీద ఉన్న వారు కూడా గాలికి ఎగిరి పడటం సంచలనం కలిగించింది. జెడ్డాలో దీనికి తోడు ఇసుక తుఫాన్ ముంచెత్తింది. భారీ మేఘాలు కమ్మేయడంతో భయానక వాతావరణం ఏర్పడింది.
మరో 24 గంటలు ఇదే తరహా వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. మక్కా ధువల్, జెడ్డా, రబీగ్ గవర్నరేట్ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. గాలివాన ప్రజలను, వస్తువులను కూడా ఎగిరిపడేలా చేశాయి. మక్కా మసీదులో ప్రార్థనకు వచ్చిన వారికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.
రోడ్లపై ఉన్న హోర్డింగులు, కరెంటు స్తంభాలు, వాహనాలు కూడా పడ్డాయి. అసలు ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ వైపరీత్యాలు కలగడానికి మనమే కారణంగా చెబుతున్నారు. మనం చేసే పనులే మనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. మనం వాడే ప్లాస్టిక్ వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. అవే మనకు ఇలా అకాల వర్షాలు రావడానికి కారణాలవుతున్నాయి. గతంలో చెన్నైకి వచ్చిన వరదలు అలాంటివే. ఇలా మనం చేసే తప్పిదాలే మనకు నష్టాలు తెస్తున్నాయని తెలుసుకుని వాటిని చేయకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి.