వ్యాయామం చేసేటప్పుడూ గుండెపోటు.. ఇదొక్కసారి చదవండి!
అవును... ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న యువత సంఖ్య పెరిగితిపోతుందనే ఆందోళనపై చర్చ బలంగా మొదలైన సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా.. ఫుల్ ఫిట్ గా ఉన్నట్లు కనిపిస్తున్న యువకులు సైతం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరో ఘటన జరిగింది! దీంతో ఈ విషయం అలర్ట్స్ పెరిగాయి!
అవును... ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్స్ చేస్తూ చేస్తూ, జిమ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, జాగింగ్ చేస్తూ పలువురు యువకులు గుండెపోటుకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.
పీజీవీసీఎల్ లో డిప్యుటీ ఇంజినీర్ హేమంత్ మానెక్ కుమారుడైన కిషన్ మానిక్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో... గమనించిన జిమ్ సహచరులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు... అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
ఈ సమయంలో జిమ్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే... కిషన్ గుండెపోటుతో అకస్మాత్తుగా నేలపై పడిపోతున్నట్లు అందులో కనిపించింది. కాగా.. కిషన్ మానిక్ వయసు 19 ఏళ్లు!
ఇదే క్రమంలో.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ కూడా జిమ్ లో వ్యాయామం చేస్తుండగానే ఓ గుండె ఆగిపోయింది. సిమ్రాన్ మోటార్స్ యజమాని కవల్జిత్ సింగ్ బగ్గా ఎప్పటిలాగానే వ్యాయామం చేసేందుకు తన స్నేహితులతో కలిసి జిమ్ కు వచ్చాడు. వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు.
ఇలా ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తూ కూడా యువకులు, జనాలు గుండెపోటుకు గురవుతుండటంపై తీవ్ర చర్చ జరుగుతుంది. పైగా... ఈ గుండెపోటుకు వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా బలవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మరణాల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన వైద్యులు ఇలా వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడానికి పలు రకాల కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువైందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. వంశపారంపర్యంగా కూడా గుండే జబ్బులకు గురవుతున్నారని వెల్లడించారు.
ఇదే క్రమంలో... ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎక్కువగా పరుగెత్తడం.. లేదా, కష్టపడి పనిచేయడం వల్ల ఒకేసారి గుండెపై భారం పెరిగి గుండెపోటుకు గురవుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఎక్కువ వ్యాయామం, శృతిమించిన శారీరక శ్రమ చాలా ప్రమాదకరమని అంటున్నారు!