పిక్స్ వైరల్... సహారా ఎడారిలో వరదలు... తెరపైకి నమ్మశక్యంకాని దృశ్యాలు!

అవును... మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.

Update: 2024-10-09 18:45 GMT

సహారా ఎడారి గురించి చాలా మందికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సహారా ఎడారిలో నీటి మడుగులు చూడగలగడం సాధ్యమేనా.. సహారా ఎడారిలోని ఈత చెట్ల మధ్య నీటి మడుగులు ఏర్పడతాయని ఎవరైనా ఊహించగలరా.. కానీ తాజాగా అదే జరిగింది. ఎడారిలో నీటి మడుగులతో కూడిన దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.

 

అవును... మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ఈ వరదల వల్ల నీటి దిబ్బలు, ఈత చెట్ల మధ్య నీటి మడుగులు ఏర్పడి అరుదైన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారని అంటున్నారు! వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

 

ఆగ్నేయ మొరాకోలోని ఎడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తుంటాయి. అయితే... సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు మాత్రం వార్షిక సగటు కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. ఈ మేరకు మొరాకో ప్రభుత్వం ఈ విషయాలు వెల్లడించింది. దీంతో 50 ఏళ్లుగా ఉండి ఉన్న సరస్సులు నీటితో నిండి ఉన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.

 

ఆ ఒక్క ఉదాహరణ చాలు.. ఇటీవల వర్షాలు ఏ స్థాయిలో కురిసాయో చెప్పడానికి! మరింత వివరంగా చెప్పుకోవాలంటే... మొరాకో రాజధాని రబాత్ కు దక్షిణంగా 450 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో 24 గంటల వ్యవధిలో సుమారు 100 మిల్లీ మీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది.

 

ఇలా ఎడారిలో వరదలు వచ్చి సరస్సులు కనిపించడం, ఈత చెట్ల మధ్య నీటి మడుగులు ఏర్పడటం గురించి తెలుసుకున్న పర్యాటకులు ఈ ఎడారిని చూడటానికి భారీగా తరలివస్తున్నారట. ఇక్కడ కనిపిస్తున్న అరుదైన దృశ్యాలు చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారంట.

 

 

ఈ విషయాలపై మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీకి చెందిన హుస్సేన్ యూఅబెబ్ స్పందిస్తూ... గడిచిన 50 సంవత్సరాలలో మొదటిసారి ఇక్కడ ఈ స్థాయిలో వర్షపాతం నమోదైందని చెబుతున్నారు.

Tags:    

Similar News