షాకింగ్ వీడియో.. కేదార్‌ నాథ్‌ ఆలయం వద్ద హెలీకాప్టర్ హల్ చల్!

ఇటీవల కాలంలో గాల్లో ప్రయాణాలకు సంబంధించిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-05-24 09:40 GMT

ఇటీవల కాలంలో గాల్లో ప్రయాణాలకు సంబంధించిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేదార్‌ నాథ్ ఆలయం ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ఇందులో భాగంగా... భక్తులను కేదార్‌ నాథ్‌ ధామ్‌ కు తీసుకెళ్తున్న హెలికాప్టర్‌ లో సాంకేతికలోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... తాజాగా కేదార్‌ నాథ్ ఆలయం ప్రాంతంలో మంచుకొండల మధ్య హెలీకాప్టర్ ఒడిదుడుకులకు లోనై భూమిని తాకింది. ఈ సమయంలో హెలికాప్టర్‌ లో పైలట్‌ తో సహా మరో 6 మంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేదార్‌ నాథ్‌ ఆలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

వివరాల ప్రకారం.. భక్తులను కేదార్‌ ధామ్‌ కు తీసుకువెళ్తున్న ఒక హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో కెస్ట్రెల్ ఏవియేషన్‌ కి చెందిన లియోనార్డో ఏ119 కోలా హెలికాప్టర్ శుక్రవారం సిర్సీ హెలిప్యాడ్ నుంచి కేదార్‌ నాథ్ ఆలయానికి ప్రయాణిస్తోంది. ఈ సమయంలో కేదార్‌ నాథ్ హెలిప్యాడ్‌ కి కేవలం 100 దూరంలో ఉండగా ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది.

ఈ సమయంలో భక్తులు పైలట్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సందర్భంగా అది తమ మీద పడిపోతుందేమోనన్న భయంతో ఆలయం వద్ద ఉన్న భక్తులు పరుగు తీయడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News