సేమ్ ఏపీ... కేంద్రంలోనూ ఓడిన మంత్రుల లిస్ట్ ఇదే!

ఆ సంగతి అలా ఉంటే... ఏపీ తరహాలోనే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులుగా భారీగా ఓడిపోయిన విషయం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-06-07 07:22 GMT

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... కేంద్రంలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా... ఎన్డీయే కూటమికి రావడంతో మరోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఏపీ తరహాలోనే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులుగా భారీగా ఓడిపోయిన విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఏపీలో వైఎస్ జగన్ కేబినెట్ లో పనిచేసిన మంత్రులకు బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రంలోనూ పరిస్థితి కాస్త అటు ఇటుగా అలానే ఉంది. 2024లో ఎన్డీయే కూటమి నుంచి పోటీ చేసిన మంత్రుల్లో 13మంది ఓటమి పాలయ్యారు. అందులో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన కీలక నేతలు కూడా ఉండటం గమనార్హం.

అమేథీ స్థానం నుంచి పోటీ చేసిన స్మృతీ ఇరానీ.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కేఎల్ శర్మ చేతిలో 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఈమె రాహుల్ గాంధీని ఓడించి ఈ కంచుకోటను స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో.. కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసిన రాజీవ్ చంద్రశేఖర్... కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేతిలో 16,077 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

మరోకేంద్ర మంత్రి అజయ్ మిశ్రా... సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఉత్కర్ష్ వర్మ చేతిలో 34,329 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అర్జున్ ముండా.. ఖుంటి లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాళీచరణ్ ముండా చేతిలో ఓటమిపాలయ్యారు. కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా ఆయన 1,49,675 ఓట్లతేడాతో ఓడిపోయారు.

అర్జున్ ముండా ఖుంటి లోక్‌ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండా చేతిలో ఓడిపోయారు. కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా... 1,49,675 ఓట్ల తేడాతో ఓడించారు. ఇదే సమయంలో... అర్రాలో అర్జున్ సింగ్ 59,808 ఓట్ల తేడాతో ఓడిపోగా.. రైతు సంక్షేమ శాఖామంత్రి కైలేష్ చౌదరి.. 4.48 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం.

ఇక పాడిపరిశ్రమల శాఖ మంత్రి ఎల్ మురగన్ కూడా తమిళనాడులో డీఎంకే అభ్యర్థి ఎ రాజా చేతిలో 2,40,585 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ కూడా టీఎంసీ అభ్యర్థి చేతిలో 39,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అదేవిధంగా... భగవంట్ ఖూబా కూడా ఓటమిపాలయ్యారు.

వీరితోపాటు పంచాయతీ రాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ పాటిల్, రైల్వే శాఖ సహాయమంత్రి రావూ సాహెబ్ దాన్వే, భారతి పన్వార్, హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ లు ఓటిపోయిన కేంద్రమంత్రుల జాబితాలో ఉన్నారు.

Tags:    

Similar News