Begin typing your search above and press return to search.

రిటైల్ లో హెరిటేజ్ నెయ్యి 585 కి వస్తున్నపుడు హోల్ సేల్ లో ఆ ధరకు రాదా ?

ఏపీలో ఇపుడు లడ్డూ ఇష్యూ మీదనే అంతా చర్చిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 6:00 AM GMT
రిటైల్ లో హెరిటేజ్ నెయ్యి 585 కి వస్తున్నపుడు హోల్ సేల్ లో ఆ ధరకు రాదా ?
X

ఏపీలో ఇపుడు లడ్డూ ఇష్యూ మీదనే అంతా చర్చిస్తున్నారు. శ్రీవారి లడ్డూ లో కల్తీ కలసింది అని ఏకంగా కూటమి ప్రభుత్వ పెద్దలే పదే పదే చెప్పడంతో జన సామాన్యంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ లాజిక్ పాయింట్ ఏంటి అంటే నెయ్యి తక్కువ ధరకు టీటీడీకి తీసుకోవడం

దానినే చూపించి నాసిరకం నెయ్యి కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేశారు అని చెబుతున్నారు. అయితే దీని మీద కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. మార్కెట్ లో కిలో నెయ్యి రేట్లు ఎలా ఉన్నాయి. ఏ డైరీ ఎంతకు ఇస్తోంది అన్న చిట్టా కూడా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

ఇక చూస్తే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ లో తయారు చేసిన ఆవు నెయ్యి ఒక లీటర్ 585 రూపాయలకు ఇస్తున్నారు. ఇది ఓపెన్ మార్కెట్ రేటు అని గుర్తు చేస్తున్నారు. పూర్తిగా రిటైల్ లో ఈ నెయ్యి ధర ఇంతలా ఉంటే హోల్ సేల్ లో టోకుల ట్యాంకుల కొద్దీ కొనుగోలు చేసే టీటీడీకి తక్కువ ధరకు నెయ్యి ఎందుకు ఇవ్వరని సోషల్ మీడియాలో నెటిజన్లు లాజిక్ పాయింట్ ని లేవనెత్తుతున్నారు

హెరిటేజ్ లో అమ్మే నెయ్యి ధర 585 రూపాయలు అయినపుడు అది ఎన్నో లాభాలను దాటుకుని వేసుకున్న ధర అయినపుడు హోల్ సేల్ లో దాని కంటే రెండు వందల రూపాయలకు తక్కువ ధరకు నెయ్యి ఎందుకు రాదు అని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్లు

దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నెయ్యి మరీ అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు అని ఒక పాయింట్ ని లేవనెత్తారు. అలా తక్కువ ధరకు వచ్చిన నెయ్యి అంటే కల్తీ అనే భావించాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రసాదాన్ని కల్తీ చేశారు అని చెప్పడానికి చంద్రబాబు పారామీటర్లుగా ఈ ధరనే ఎంచుకున్నారని నెటిజన్లు గుర్తు చేస్తూ ధరలు హోల్ సేల్ ధరలు వేరేగా ఉంటాయి కదా అని జవాబు చెబుతున్నారు.

కిలో నెయ్యి 319 అంటే ఆ ధరకు వనస్పతి, పామాయిల్ కూడా రాదు అని కూడా అంటున్నారు. మరి ఈ లాజిక్ పాయింట్ కి నెటిజన్లే లాజిక్ గా తిప్పికొడుతున్నారు. హెరిటేజ్ లో దొరికే నెయ్యి ధరే ఆరు వందల రూపాయలు మించనపుడు పెద్ద మొత్తంలో కొనే నెయ్యి ధరను తగ్గించి ఇచ్చారని ఎందుకు భావించకూడదని అడుగుతున్నారు.

ఏది ఏమైనా ఇది కూడా పాయింటే కదా అన్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద డిబేటే సాగుతోంది. మొత్తానికి చూస్తే కనుక నెయ్యి కిలో అన్నది లాజిక్ కి అందే పాయింటా కాదా అంటే తెలివి మీరిన నెటిజన్ల ప్రశ్నలకు జవాబు చెప్పడం బహు కష్టమే అని కూడా అంటున్నారు.