అత్యంత సంపన్న గణేషుడు ఎవరు? ఎక్కడున్నాడు?

భారతదేశం మొత్తం వినాయక చవితి శోభను సంతరించుకుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రులకు వినాయకులు దిగివచ్చారు.

Update: 2024-09-06 09:36 GMT

భారతదేశం మొత్తం వినాయక చవితి శోభను సంతరించుకుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రులకు వినాయకులు దిగివచ్చారు. భారీ భారీ ప్రతిమలు.. అందమైన సెట్లను రెడీ చేశారు. ఒక్కో చోట ఒక్కో వెరైటీని ప్రదర్శిస్తున్నారు.

వినాయక చవితికి కేరాఫ్ అడ్రస్ ముంబై. ముంబై అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్. ఆహా.. ఒక్కో సెట్టింగ్, ఒక్కో వినాయకుడిని చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఏటా వినాయకుడిని అత్యంత భారీ మొత్తంలో కరెన్సీతో, బంగారంతో అలంకరించేది కూడా అక్కడ. అయితే.. ఈ సారి కూడా ఆ రికార్డును ముంబై కొనసాగిస్తున్నదా లేదా అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో.. తగ్గేదేలే అని మరోసారి ముంబై ప్రజలు నిరూపించారు.

అవునండి.. మరోసారి అత్యంత ధనిక గణనాథుడిని ముంబైలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ముంబైలోని జిఎస్‌బి సేవా మండల్ ఆధ్వర్యంలో 66 కిలోల బంగారు ఆభరణాలతోపాటు 325 కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తున్నారు. ఏటా ఇక్కడి వినాయకుడిని ఇలా గ్రాండ్‌గా అలంకరించడం ఆనవాయితీ.

ఈసారి కూడా ఏ మాత్రం తగ్గకుండా అదేస్థాయిలో తీర్చిదిద్దారు. అంతేకాదు.. ఆ గణపతికి రూ.400.58 కోట్ల బీమా కవరేజీ కూడా తీసుకున్నారు. అలాగే.. ‘లాల్‌బాగ్చా రాజా’ గణపతికి అనంత్ అంబాని 20 కిలోల బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు.

Tags:    

Similar News