బిగ్ బ్రేకింగ్... రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్!

గత కొన్ని రోజులుగా అత్యంత రసవత్తరంగా మారిన 'రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీస్' వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-12-02 08:51 GMT

గత కొన్ని రోజులుగా అత్యంత రసవత్తరంగా మారిన 'రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీస్' వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఏపీలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులకు సంబంధించిన ముందస్తు బెయిల్ కు ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిగింది. ఈ మేరకు ఆర్జీవీ పిటిషన్ పై హైకోర్టు మద్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చింది.

అవును... ఆంధప్రదేశ్ లో తనపై నమోదైన కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు హైకోర్టు మద్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చింది. సోమవారం (ఈ నెల 9) వరకూ అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది!

కాగా... ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచార్ణకు రావాలంటూ హైదారాబాద్ లోని ఇంటికి వెళ్లి ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే! దీంతో... షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు ప్రస్తుతానికి హాజరుకాలేనని.. ఆన్ లైన్ లో విచారించవచ్చని వర్మ పోలీసులకు వెల్లడించారు.

ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఒకటి.. మొత్త కేసులు కొట్టివేయాలని మరోసారి హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరోపక్క... వర్మ తప్పించుకు తిరుగుతున్నారని.. ఆయన కోసం ఏపీ పోలీసులు రెండు రాష్ట్రాల్లో, మూడు ప్రాంతాల్లో, ఆరు బృందాలుగా గాలిస్తున్నారంటూ మీడియాలో కథనాలు హల్ చల్ చేశాయి.

అయితే.. ఆ కథనాలన్నీ ఫేక్ అని, తాను తన ఆఫీస్ (ఆర్జీవీ డెన్) లోనే ఉన్నానని.. ఏపీ పోలీసులు తన ఆఫీసులోకి ఇప్పటివరకూ ఎంటరవ్వలేదని.. తనను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు తనతో కానీ, తనకు సంబంధించినవారితో కానీ చెప్పలేదని.. తనపై ఓ వర్గం మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు!

ఇక తనకు పరామర్శలు వెళ్లివెత్తుతుండటంతో వాటిని భరించలేక ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు తెలిపారు. మరోపక్క వరుసగా పలు టీవీ ఛానల్స్, యూట్యూబ్స్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చారు! ఈ నేపథ్యంలో... ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Tags:    

Similar News