భార్యభర్తల శృంగారం విషయంలో మరో సంచలన తీర్పు!
దీంతో సదరు భర్త హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
దేశంలో ఇటీవల కాలంలో భార్యాభర్తల శృంగారంపై అనేక కేసులు, తదనగుణంగా తీర్పులు, ఫలితంగా రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా దాంపత్య జీవితంలో శృంగారం కూడా అత్యంత కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్న వేళ ఈ వ్యవహారంపై ఇప్పటికే అనేక కోర్టులు ఎన్నో తీర్పులు ఇచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
అవును... భార్య శృంగారానికి నిరాకరిస్తే.... అనే అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య వివాహాన్ని రద్దు చేయడానికి లేదా సరైన కారణం లేకుండా భర్తతో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించడం మానసిక క్రూరత్వానికి సమానమని పేర్కొంది. ఈ కారణం హిందూ వివాహ చట్టం ప్రకారం సదరు భర్త.. ఆమె నుంచి విడాకులు తీసుకోవడానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది.
వివరాళ్లోకి వెళ్తే... భోపాల్ కు చెందిన ఓ వ్యక్తి 2006 - జూలై 12న వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి 2006 జూలై 28 వరకు అనగా దాదాపు 16 రోజులపాటు భార్య అతన్ని తాకనివ్వలేదు. దీంతో విసిగిపోయిన సదరు భర్త విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. పెళ్లైతే అయ్యింది కానీ... తాను భారతదేశం విడిచి వెళ్లే వరకు భార్య తనను ముట్టనివ్వలేదని, ఈ కారణం చేత తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ వాదనతో ఫ్యామిలీ కోర్టు ఏకీభవించలేదు. విడాకులు మంజూరు చేయడానికి ఇది ఏమాత్రం సరైన కారణం కాదని తెలిపింది. అనంతరం నవంబర్ - 2014లో పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో సదరు భర్త హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ఇందులో భాగంగా... సరైన కారణం లేకుండా తన భర్తతో శృంగారంలో పాల్గొనడానికి భార్య నిరాకరించడం మానసిక క్రూరత్వానికి సమానమని తెలిపింది. ఇది విడాకులకు సరైన కారణం కాదంటూ ఫ్యామిలీ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు తప్పని వ్యాఖ్యానించింది. తన భర్త వివాహా అనంతరం భారతదేశాన్ని విడిచిపెడతాడని సదరు మహిళకు తెలుసునని, అయినప్పటికీ ఆమె కావాలనే ఆ కార్యంలో పాల్గొనడానికి నిరాకరించిందని పేర్కొంది.
ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ... ఎటువంటి శారీరక అసమర్థత.. లేదా, సహేతుకమైన కారణం లేకుండా ఎక్కువ కాలం పాటు లైంగిక సంపర్కం చేయడానికి ఏకపక్షంగా నిరాకరించడం మానసిక క్రూరత్వానికి దారితీస్తుందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆ సమయంలో విడాకులు కోరే హక్కు సదరు భర్తకు ఉంటుందని పేర్కొంది!