కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా... బీఆరెస్స్ మేనిఫెస్టో హైలైట్స్ ఇవే!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆరెస్స్ దూకుడు ప్రదర్శిస్తోంది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆరెస్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆరెస్స్... ఇప్పుడు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన దళిత బంధు, రైతు బీమా కొనసాగిస్తూ మరికొన్ని సరికొత్త పథకాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచుతున్న కేసీఆర్... ఈ క్రమంలో తాజాగా మేనిఫెస్టో ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను కూడా అమలు చేసిన ఘనత తమదేనని వెల్లడించారు. ఇదే సమయంలో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టోను రూపించినట్లు చెబుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన తొలిసారి ఎన్నికల్లో మేనిఫెస్టోను ముందుగానే విడుదల చేసిన గులాబీ పార్టీ.. 2018లో మాత్రం ఎన్నికలకు కేవలం మూడురోజుల ముందే విడుదల చేసింది. ఆ రెండింటికీ భిన్నంగా అన్నట్లుగా ఈసారి మాత్రం 45 రోజుల ముందే మేనిఫెస్టోను ప్రకటించింది.
బీఆరెస్స్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా. ఈ పథకం "కేసీఆర్ బీమా-ఇంటింటికీ ధీమా"తో రాష్ట్రంలో 93లక్షల కుటుంబాలకు లబ్ది.
ఆసరా పింఛన్లు రూ.3వేలకు పెంపు. దిఏ సమయంలో... ఏటా రూ.500ల చొప్పున పెంచుతూ... రూ.5వేలకు పెంపు.
సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి.
దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంపు.
అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్. ఉద్యోగుల తరహాలో కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా
జర్నలిస్టులకు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉచిత వైద్యం
రైతు బంధు మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంపు.
పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగింపు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం.
దళిత బంధు, రైతు బీమా కొనసాగింపు.
46 లక్షల మంది మహిళల సంఘాలకు సొంత భవనాలు.
అసైన్డ్ లాండ్ పై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి అమ్ముకునే హక్కు.