ఇరాన్ లో మరోసారి హిజాబ్ వివాదం.. పాటపాడిన మహిళ మిస్సింగ్!
వివరాళ్లోకి వెళ్తే... ఇరాన్ కు చెందిన జారా ఇస్మాయిలీ అనే యువతి ఓ పాట పాడింది. ఇంగ్లిష్ గాయని రాసిన ఆ పాట పాడుతున్న సమయంలో జారా హిజాబ్ ధరించలేదు.
ఇరాన్ లో 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. అయితే... ఈ నిబంధనను చాలా మంది మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా వ్యతిరేకించే మహిళల్లో ఒకరైన సింగర్... హిజాబ్ ధరించకుండా బహిరంగంగా పాట పాడింది. అయితే.. ఇప్పుడు ఆమె కనిపించకుండా పోయిందంటూ కథనాలు వస్తుండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
అవును... ఇరాన్ దేశంలో హిజాబ్ అంశం మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇందులో భాగంగా... హిజాబ్ ధరించకుండా ఓ మహిలా సింగర్ బహిరంగంగా పాట పాడటంతో ఆమెను అరెస్ట్ చేశారు. అయితే.. అప్పటి నుంచి ఆమె జాడ లేకుండా పోయిందని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... ఇరాన్ కు చెందిన జారా ఇస్మాయిలీ అనే యువతి ఓ పాట పాడింది. ఇంగ్లిష్ గాయని రాసిన ఆ పాట పాడుతున్న సమయంలో జారా హిజాబ్ ధరించలేదు. దీంతో.. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆమె ఆచూకీ తెలియడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు!
మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేసే నిబంధనను వ్యతిరేకించే మహిళల్లో ఒకరైన జారా... మెట్రో స్టేషన్ లూ, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో... ఈ అరెస్ట్ ను పలువురు మహిళలు ఖండించారు. ఇదే సమయంలో అరెస్టైన ఆమె జాడ కనిపించకపోవడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా... రెండేళ్ల క్రితం హిజాబ్ నిరసనలు ఇరాన్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా మాసా అమినీ అనే యువతిని ఇదే కారణంతో అరెస్ట్ చేయగా.. పోలీసుల కస్టడీలోనే ఆమె తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. వేలాదిమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. వారికి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించింది.
ఆ సమయంలో వీరి నిరసనలు ఒకరి ద్వారా ఒకరికి తెలిసి పెద్ద ఎత్తున చెలరేగింది. మహిళలంతా ముక్తకంఠంతో హిజాబ్ నిబంధనకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. అయితే... ఇరాన్ సర్కార్ ఈ నిరసనలపై ఉక్కుపాదం మోపింది. ఈ సమయంలో తాజాగా జారా కూడా కనిపించడం లేదు అనే వార్త తెరపైకి రావడంతో.. ఆమె పరిస్థితి ఏమైందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.