హోం మంత్రి అనితకు మొత్తం సెగ.. ఏం జరుగుతోంది..?
పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాకు వచ్చారు.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు సర్వత్రా సెగ తగులుతోంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుం డా.. సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా..ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హోం శాఖపై ఆమెకు పట్టుందని పైకి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, పోలీసు అధికా రులు వ్యవహరిస్తున్న తీరు అనితకు ఇబ్బందిగానే ఉంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాకు వచ్చారు.
ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మండల్ అనే కార్మికుడు రోడ్డు దాటుతుండగా.. అదేదారిలో వచ్చిన సీఐ వాహనం.. ఆ వ్యక్తిని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చచ్చిపోయాడు. అయితే.. సీఐ ఎదురు దాడి చేసి.. సదరు కార్మికుడు తాగి రోడ్డుపైకి వచ్చాడని.. అతనే తమ వాహనానికి అడ్డు పడ్డి చచ్చాడని పరుషంగా వ్యాఖ్యానించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో కార్మికులు ఏమీ చేయలేక.. మౌనంగా శవాన్ని పశ్చిమ బెంగాల్‌కు తరలించారు.
అయితే.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి పిర్యాదు చేసింది. ఇది ప్రస్తుతంరాష్ట్ర హోం శాఖకు ఇబ్బందిగా మారింది. అదే ఇతరులు ఎవరైనా ఇలా నే చేస్తే.. సీఐ అలా తప్పించుకునే వారా? అన్నది ప్రశ్న. ఇక, తాజాగా ఒంగోలులోనే ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని స్టేషన్‌కు వస్తే.. ఆధారాలు చూపించాలంటూ.. ఓ సీఐ గద్దించాడు. అంతేకాదు.. అప్పటి వరకు కేసు పెట్టనని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.
ఈ రెండు ఉదంతాలు కూడా హోం శాఖకుమచ్చగా మారాయి. ఇక, సొంత నియోజకవర్గం పాయకరావుపే టలో మరో దుమారం రేగింది. నియోజకవర్గంలోప్రధాన పట్టణంలో మద్యం బెల్టు షాపులకు ఓపెన్ ఆక్షన్ నిర్వహించారు. దీనికి సంబంధించి స్థానికంగా ప్రకటనలు కూడా ఇవ్వడం, దండోరా వేయించడం మరిం త వివాదంగా మారింది. ఒకవైపు.. సీఎం చంద్రబాబు బెల్టు తీస్తానని చెబుతుంటే.. అదే హోం శాఖ మంత్రి నియోజకవర్గంలో ఇలా దండోరా వేసి బెల్టు షాపులకు వేలం నిర్వహించడం వివాదానికి దారితీస్తోంది. ఈ ప్రభావం అనితపై బాగానే పడనుందని అంటున్నారు పరిశీలకులు.