హనీరోజ్ వేధింపుల కేసు... సిట్ అధికారుల కీలక స్టెప్!

ఇటీవల కాలంలో నటీమణుల వేధింపుల వ్యవహారం మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-08 10:27 GMT

ఇటీవల కాలంలో నటీమణుల వేధింపుల వ్యవహారం మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాను వేధింపులు ఎదుర్కొన్నట్లు నటి హనీరోజ్ తెలిపారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... సోషల్ మీడియా వేదికగా తాను వేధింపులు ఎదూర్కొన్నట్లు తెలిపిన మలయాళ నటి హనీరోజ్.. పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈమె ఫిర్యాదుతో సుమారు 27 మందిపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో.. ఇందులో కీలక వ్యక్తిగా భావించిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన నటీ హనీ రోజ్... ఇప్పుడు తనకు ఎంతో ప్రశాంతంగా ఉందని చెబుతూ.. ఈ కేసూ గురించి ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తిసుకెళ్లినట్లు తెలిపారు. అయితే.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తనకు మాట ఇచ్చారని హనీ రోజ్ వెల్లడించారు.

కాగా... ఓ వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్లు హనీ రోజ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఓ వ్యక్తి తనను కావాలని అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడని.. తాను సైలంట్ గా ఉంటుంటుటే.. ఆ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నావా అని పలువురు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు.

వాస్తవానికి ఆ వ్యక్తి గతంలో తనను కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించాడని.. అయితే, వేరువేరు కారణాల వల్ల వెళ్లేందుకు నిరాకరించినట్లు ఆమె తెలిపారు. నాటీ నుంచి నేను హాజరయ్యే ప్రతీ ఈవెంటుకూ రావడం, వీలు కుదిరినప్పుడల్ల తనను కించపరిచేలా వ్యాఖ్యానించడం ప్రారంభించాడని అమె తెలిపారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపిన హనీరోజ్.. తన లుక్స్ పై సరదా జోక్స్, మీమ్స్ ను తాను స్వాగతిస్తానని.. వాటిని పెద్దగా పట్టించుకోకని.. కానీ.. అవి హద్దూ దాటి, అసభ్యకరంగా మారితే మాత్రం సహించనని స్పష్టం చేశారు.

మరోవైపు... హనీరోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) మద్దతు తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని.. అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని తెలిపింది.

Tags:    

Similar News