వీడేం మామ సామి? హానీమూన్ ట్రిప్ పై వాదన.. యాసిడ్ దాడి

కలలో కూడా ఊహించని ఈ యాసిడ్ దాడి గురించి తెలిస్తే మాత్రం విస్మయానికి గురి కావాల్సిందే.

Update: 2024-12-20 04:17 GMT

యాసిడ్ దాడి వార్తల్ని చదువుతుంటాం. కానీ.. ఇప్పుడు చెప్పేది.. మీరు చదివేది మాత్రం భిన్నమైనది. కలలో కూడా ఊహించని ఈ యాసిడ్ దాడి గురించి తెలిస్తే మాత్రం విస్మయానికి గురి కావాల్సిందే. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. కొత్తగా పెళ్లైన దంపతులు హనీమూన్ కు ప్లాన్ చేస్తున్న వేళ.. పిల్లను ఇచ్చిన మామ.. హనీమూన్ కు ఎక్కడకు వెళ్లాలన్న విషయంపై వాగ్వాదానికి దిగటం..తీవ్ర ఆగ్రహంతో యాసిడ్ దాడికి పాల్పడిన వైనంలోకి వెళితే..

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 29 ఏళ్ల ఇబాద్ అతీక్ ఫాల్కే ను తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశారు 65 ఏళ్ల గులామ్ ముర్తజా ఖోటాల్. పెళ్లి తర్వాత వారి మధ్య హనీమూన్ టాపిక్ వచ్చింది. హనీమూన్ కోసం కశ్మీర్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా ఇబాద్ పేర్కొనగా.. అలాంటిది వద్దని.. విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని మామ ముర్తజా అడ్డుకున్నారు.

ఈ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు మామ గులామ్ ముర్తజా. తాజాగా ఇంటికి వచ్చిన అతీక్ తన వెహికిల్ ను రోడ్డు పక్కన ఆపి ఇంట్లోకి వెళ్లబోయాడు. అదేటైంలో అక్కడే కారులో వెయిట్ చేస్తున్న మామ ఉన్నపళంగా అల్లుడి ముఖం మీద.. ఒంటి మీదా యాసిడ్ పోసి దాడికి పాల్పడ్డారు.దీంతో.. గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మరోవైపు.. దాడి అనంతరం పరారీ అయ్యాడు మామ. కేసు నమోదు చేసిన పోలీసులు మామ కోసం వెతుకుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.

Tags:    

Similar News