అంతా సిద్ధం... పులివెందుల – 22.. కుప్పం – 18.. పిఠాపురం - 18!
అవును... ఆంధ్రప్రదేశ్ లోని హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గాలలో పులివెందుల, కుప్పం, పిఠాపురం, మంగళగిరి. హిందూపూర్ ఉన్నాయనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మరో మూడు రోజుల్లో (జూన్ 4) కౌంటింగ్ మొదలవ్వబోతుంది. ఆ రోజు మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ వచ్చేస్తుందని.. రాత్రికి ఫుల్ క్లారిటీ కన్ ఫాం అని అంటున్నారు. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ ఎన్ని ఏర్పాట్లూ చేసేస్తోంది!
భారీ పోలీసుల మొహరింపు, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, మూడంచెల భద్రత నడుమ కౌంటింగ్ జరగబోతుందని అంటున్నారు. పోలింగ్ రోజు పలు ప్రాంతాల్లో జరిగిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసీ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఈసారి ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో ఫలితాలు ఎన్ని రౌండ్లలో వెలువడనున్నాయనేది ఇప్పుడు చూద్దాం...!
అవును... ఆంధ్రప్రదేశ్ లోని హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గాలలో పులివెందుల, కుప్పం, పిఠాపురం, మంగళగిరి. హిందూపూర్ ఉన్నాయనే చెప్పాలి. దీంతో... ఈ కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. ఆ లెక్కన చూస్తే... పులివెందులలో ఎక్కువ రౌండ్లలో లెక్కింపు జరగనుంది!.
ఇందులో భాగంగా... జగన్ పోటీ చేసిన పులివెందుల సెగ్మెంట్ లో 22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఈసారి జగన్ మెజారిటీపై.. రాష్ట్రస్థాయిలో ప్రజానికం చూపు పులివెందుల వైపు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కుప్పం విషయానికొస్తే... ఇక్కడ అత్యల్పంగా 18 రౌండ్లు ఉన్నాయి. ఈసారి వైనాట్ కుప్పం అని జగన్ ప్రచారం చేయడంతో.. కుప్పంపై ప్రత్యేక ఇంట్రస్ట్ నెలకొందని అంటున్నారు.
ఇక ఈసారి ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా టాప్ 3లో ఉందనే చెప్పాలి. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి కూటమి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ చెప్పడంతో ఇక్కడ ఫలితాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా కుప్పం తరహాలోనే 18 రౌండ్ల కౌంటింగ్ ఉంది.
అనంతరం... టీడీపీ యువనేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిపైనా ఈసారి ప్రత్యేక ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఈసారి లోకేష్ గెలుస్తారా.. గెలిస్తే ఏ స్థాయి మెజారిటీతో గెలుస్తారు అనే విషయాలపై తెగ చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో 21 రౌండ్ల కౌంటింగ్ ఉంది. దీంతో.. దీనికి సంబంధించిన తుది ఫలితం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు!
ఇక ఈ హాట్ టాప్ 5 నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటనే చెప్పాలి. ఇక్కడ నుంచి టీడీపీ తరుపున నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో... ఈ సారి ఆయన హ్యాట్రిక్ విజయంపైనే అందరి దృష్టీ నెలకొంది. మరి.. ఫ్యాన్స్ అంతా భావిస్తున్నట్లు టీడీపీ కంచుకోట హిందూపూరంలో బాలయ్య హ్యాట్రిక్ కొడతారా.. లేక, వైసీపీ అభ్యర్థి దీపిక చేతిలో పరాభవం చెందుతారా అనేది వేచి చూడాలి. ఇక్కడ 19 రౌండ్ల కౌంటింగ్ ఉంది!