షాకింగ్ సీక్రెట్.. షార్క్‌ను హిప్నోటైజ్ చేయడం ఇంత సింపులా?
షార్క్ వంటి చేపను హిప్నోటైజ్ చేయడానికి యానిమల్ హిప్నోసిస్ వంటి ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగిస్తారు.;

నీటిలో ఉన్నప్పుడు ఒక షార్క్ మిమ్మల్ని దాడి చేయడానికి వస్తుంటే మీరు ఏమి చేస్తారు? షార్క్ వంటి ప్రమాదకరమైన చేపను చూస్తే ఎవరికైనా భయంతో గుండె ఆగినంత పనవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే, షార్క్ వంటి వేటగాళ్ల నుండి తప్పించుకోవడం చాలా సులభం. దీని కోసం మీరు వాటిని హిప్నోటైజ్ చేయడం తెలిసి ఉండాలి. దీనిలో మీరు శిక్షణ పొంది ఉండాలి. కొంచెం పొరపాటు జరిగినా మీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు.
షార్క్ వంటి చేపను హిప్నోటైజ్ చేయడానికి యానిమల్ హిప్నోసిస్ వంటి ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి షార్క్ దాడి నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. దీనిని టానిక్ ఇమ్మొబిలిటీ అని కూడా అంటారు. షార్క్ దాడి చేయడానికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా దానిని తలకిందులుగా చేసి దాని కన్ను, ముక్కు దగ్గర తేలికగా ఒత్తిడి చేయాలి. ఇలా చేయడం వల్ల షార్క్ హిప్నోటైజ్ అవుతుంది.
పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం, ఒకసారి హిప్నోటైజ్ అయిన తర్వాత షార్క్ కనీసం 15 నిమిషాల పాటు అదే స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో దాని అవయవాలు కూడా సడలిపోతాయి. మగ షార్క్‌లు కూడా సంతానోత్పత్తి సమయంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆడ షార్క్ తలకిందులుగా మారి హిప్నోటైజ్ అవుతుంది. 15 నిమిషాల పాటు ప్రశాంతంగా ఉంటుంది. యానిమల్ హిప్నోసిస్ లేదా టానిక్ ఇమ్మొబిలిటీ కేవలం షార్క్‌లలోనే కాదు, కొన్ని ఇతర సరీసృపాలు, జంతువులలో కూడా ఈ విధంగా హిప్నోటైజ్ చేయవచ్చు.