ఓవర్ స్పీడ్.. చలానా ఎంతో తెలుసా? జస్ట్ రూ.1.1కోట్లు

ట్రాఫిక్ నిబంధనల్ని పట్టించుకోకుండా వాహనాల మీద దూసుకెళ్లే వారికి ఫైన్లు వేయటం మామూలే.

Update: 2024-09-29 05:13 GMT

ట్రాఫిక్ నిబంధనల్ని పట్టించుకోకుండా వాహనాల మీద దూసుకెళ్లే వారికి ఫైన్లు వేయటం మామూలే. హైదరాబాద్ మహానగరంలో ఏమూలన చూసినా ఏదో ట్రాఫిక్ పంచాయితీ కనిపిస్తుంది. కానీ.. అలాంటి వాటిని క్లియర్ చేసే కన్నా.. చలానాలు వడ్డించటానికి ట్రాఫిక్ పోలీసులు సదా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే.. మన దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే ఫైన్ల విషయంపై అప్పుడప్పుడు గగ్గోలు పెడుతుంటారు. కానీ.. తాజా ఉదంతం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఫిన్లాండ్ కు చెందిన అండర్స్ విక్లాఫ్ అనే వ్యక్తి పరిమితికి మించి గంటకు ముప్ఫై కిలోమీటర్ల అదనపు స్పీడ్ తో వాహనాన్ని నడుపుతున్నాడు. అతన్ని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు అతడికి వేసిన జరిమానా గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఎందుకంటే అతడికి వేసిన ఫైన్ అక్షరాల రూ.1.21 కోట్లు. ఆ దేశ కరెన్సీతో లెక్కితే రూ.1.21 లక్షల యూరోలు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిలో విషయంలో పలు దేశాల్లో ఎంత కఠినంగా వ్యవహరిస్తారన్న దానికి ఇదో నిదర్శనంగా చెప్పాలి.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఫిన్లాండ్ లో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన వ్యక్తి ఆదాయానికి అనుగుణంగా ఫైన్ వేయటం ఆ దేశంలో ఉంటుంది. విక్లాఫ్ సంపన్నుడు కావటంతో అతడికి ఇంత భారీగా ఫైన్ వేశారు. ఇంత కఠినంగా ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేయటం వల్లే.. ప్రపంచంలోనే అత్యల్పరోడ్డు ప్రమాదాల మరణాలు నమోదరయ్యే దేశంగా ఫిన్లాండ్ ను చెబుతుంటారు.

ఫిన్లాండ్ లో ప్రతి లక్ష మంది నివాసితులకు 3.8 మంది రోడ్డుప్రమాదాల్లో మరణిస్తుంటే.. ప్రపంచ సగటు 17.4 మరణాలుగా చెబుతారు. మన దేశం విషయానికి వస్తే 15.6గా ఉన్నట్లు తేల్చారు. గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ రోడ్డు ప్రమాద మరణాలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. 2010-21 మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు 5 శాతం తగ్గగా.. భారత్ లో మాత్రం అనూహ్యంగా ఈ రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ కారణంగానే భారత్ లోనూ ఫిన్లాండ్ తరహాలోనే ట్రాఫిక్ ఉల్లంఘనటలను అమలు చేయటం ముఖ్యమైన వాదన నడుస్తోంది.

ఫిన్లాండ్ లో ట్రాఫిక్ ఫైన్లు భారీగా ఉంటాయి. నిబంధనల ఉల్లంఘన తీవ్రత తీవ్రంగా ఉంటుంది. నెలసరీ సంపాదనలో ఆదాయపన్ను మినహాయిస్తే మిగిలినదే రోజువారీ ఆదాయంగా పరిగణిస్తారు. ఒక ఉల్లంఘనకు 20 రోజుల జరిమానా వస్తే.. అప్పుడు అతడి రోజువారీ సంపాదన 100 యూరోలుగా ఉండాలని.. 2 వేల యూరోలుగా ఫైన్ విధిస్తారు. అందుకే.. ట్రాఫిన్ ఉల్లంఘనటకు అక్కడి వారు అస్సలు ఇష్టపడరు.

Tags:    

Similar News