వరద బాధితులకు భారీ విరాళాలు... కదిలివస్తోన్న రియల్ హీరోలు!

ఈ సమయంలో కాటూరి మెడికల్ కాలేజీ అధినేత కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.

Update: 2024-09-07 07:42 GMT

ఏపీలో భారీ వరదలు వణికించేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ విజయవాడ సహా పలు ప్రాంతాలు వరద నీటిలో నానుతున్న పరిస్థితి. ఈ సమయంలో దాతలు ముందుకు వస్తున్నారు. సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ సమయంలో కాటూరి మెడికల్ కాలేజీ అధినేత కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.


అవును... ఏపీలో వరదలు విజృంభించిన నేపథ్యంలో భారీగా విరాళాలు అందజేస్తున్నారు దాతలు. ఈ మేరకు పలు సంస్థల అధిపతులు, ప్రతినిధులు, వ్యక్తులు, పలు సంఘాలు చంద్రబాబుని కలిసి విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు విరాళాన్ని అందజేశారు. ఇదే సమయంలో... రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఒక రోజు బేసిక్ శాలరీ రూ.12 కోట్లను విరాళంగా ప్రకటించారు.

ఇదే క్రమంలో... ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రూ.7.70 కోట్ల విరాళమివ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా... జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యుల ఒక నెల గౌరవ వేతనం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని తీర్మానించినట్లు ప్రకటన విడుదలయ్యింది. ఇదే సమయంలో సర్పం సర్పంచుల సంక్షేమ సంఘం రూ.3.92 కోట్ల విరాళమివ్వాలని తీర్మానించింది.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రూ.1.50 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, కుటుంబ సభ్యులు రూ. కోటి విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు. ఇదే క్రమంలో... ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కోటిన్నర రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

ఇక శ్రీచైతన్య విద్య సంస్థల రూ.2 కోట్లు విరాళం ప్రకటించాయి. ఈ మేరకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సీఎం కు ఆ సంస్థ డైరెక్టర్లు అందజేశారు. అదేవిధంగా... ఏపీ సివిల్ సర్వీస్ అసోసియేషన్ రూ. కోటి విరాళాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది!

Tags:    

Similar News