బిగ్ బ్రేకింగ్: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. వైరల్ వీడియోలు!
ఈ భూకంపం కారణంగా.. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.;

శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ మేరకు మయన్మార్ లో ఈ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూ.ఎస్.జీ.ఎస్.) వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా.. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
అవును... మయన్మార్ లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అంతర్యుద్ధంతో ఇబ్బంది పడుతున్న మయన్మార్ లో తాజా భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ సమయంలో.. ఈ భారీ భుకంప తీవ్రత వల్ల మయన్మార్ లోని మండలేలోని ఐకానిక్ అవా వంతెన కూలిపోయింది. ఇది ఇరావడీ నదిపై నిర్మించబడింది! దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో.. మయన్మార్ లో అనేక భవనాలు కూడా నేలమట్టమయ్యాయని తెలుస్తోంది.
ఇదే సమయంలో... బ్యాంకాక్ లోనూ బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక్కడ భూకంప తీవ్రత 7.3 నమోదైంది. ఇక్కడ సుమారు 17 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తుండగా.. వీరిలో చాలా మంది ఎత్తైన అపార్ట్ మెంట్స్ లోనే నివసిస్తున్నారు. ఈ సమయంలో.. హోటళ్లు, ఎత్తైన భవనాల నుంచి జనాలో భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ నేపథ్యలో బ్యాంకాక్ లో కొన్ని మెట్రో, రైళ్ల సేవలు నిలిపివేయబడ్డాయని.. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని బీజింగ్ భూకంప సంస్థ తెలిపింది. ఈ సమయంలో... పరిస్థితిని సమీక్షించడానికి థాయ్ ప్రధాని పేంటోగ్టార్న్ షినవత్రా అత్యవస సమావేశం నిర్వహిస్తున్నారు!