అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి... చంచల్ గూడ జైలు వద్ద భారీ బందోబస్తు!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమన్యాన్ని, అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమన్యాన్ని, అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు తాజాగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్ష నిమిత్తం గాంధీకి తరలించారు.
అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి మందు హాజరుపరిచారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కోసం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు.. నాంపల్లి కోర్టుకు వెళ్తున్నారని అంటున్నారు. మరోపక్క ఉదయం చిక్కడపల్లి స్టేషన్ పలువురు సినీ ప్రముఖులు వెళ్లారు. ఈ సమయంలో చిరంజీవి.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
అవును... సంధ్య థియేటర్ వద్ద ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. ఆయన నివాసానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ చేరుకున్నారు. ఇదే సమయంలో జనసేన కీలక నేత నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు.
సంధ్య థియేటర్ వద్ద ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ (ఆల్లు ఆర్జున్) అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి (ఛిరంజీవి), ఆయన సతీమణి సురేఖ అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు, నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
మరోవైపు... గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అల్లు అర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మరోవైపు చంచల్ గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. దీంతో... జరబోయే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని అంటున్నారు.