హజ్ యాత్రలో ఉక్కపోత విషాదం.. 5 రోజుల్లో 500 మంది మృత్యువాత!

షాకింగ్ నిజం ఏమంటే.. గడిచిన ఐదు రోజుల్లో హజ్ యాత్రకు వచ్చిన యాత్రికుల్లో 500 మంది మరణించటం షాకింగ్ గా మారింది.

Update: 2024-06-20 05:37 GMT

జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలని.. అందుకోసం చేపట్టే హజ్ యాత్ర వందలాది మంది ప్రాణాల్ని తీస్తోంది. ఈ ఏడాది విపరీతమైన ఉక్కపోత కారణంగా.. వందలాది మంది హజ్ యాత్రికుల మరణానికి కారణమైంది. వడదెబ్బ సోకి వందల మంది మరణించారు. వారి మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు.. బంధువుల వినతలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. షాకింగ్ నిజం ఏమంటే.. గడిచిన ఐదు రోజుల్లో హజ్ యాత్రకు వచ్చిన యాత్రికుల్లో 500 మంది మరణించటం షాకింగ్ గా మారింది.

ఈసారి వేడిగాలులు తీవ్రంగా ఉండటంతో హజ్ యాత్రికులు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున వడదెబ్బ బారిన పడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈసారి హజ్ యాత్ర సందర్భంగా ఎంత మంది మరణించారన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఆన్ లైన్ సమాచారం ప్రకారం గడిచిన ఐదు రోజుల్లో మాత్రం 550 మంది మరణించినట్లుగా తేలింది.

ఈ ఏడాది మొత్తం 18.3 లక్షల మంది హజ్ యాత్రను పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉండగా.. సౌదీ పౌరులు 2 లక్షలకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉక్కపోతతో మరణించిన వారిలో మన దేశానికి చెందిన యాత్రికులతో పాటు అల్జీరియా.. టునీసియా.. జోర్డాన్.. ఈజిప్టులతో పాటు పలు దేశాల యాత్రికులు ఉన్నారు. మక్కా పొరుగున ఉన్న అల్ ముఆయ్ సెమ్ లోని అత్యవసర కాంప్లెక్సు వద్ద వందలాది యాత్రికులు తమ కుటుంబ సభ్యుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News