అమెరికాను వణికించిన హరికేన్ హెలెనా... విధ్వంసం ఏస్థాయిలో అంటే..?

ఈ తుఫాను కారణంగా ఇప్పటివరకూ 44 మంది మృతి చెండినట్లు చెబుతున్నారు.

Update: 2024-09-28 09:30 GMT

ఆగ్నేయ అమెరికాలో అతితీవ్రమైన హరికేన్ హెలెనా విధ్వంసం సృష్టిస్తోంది. హెలెన్ నేషనల్ హరికేన్ సెంట్రల్ డేటా ప్రకారం... యూఎస్ చరిత్రలో 14వ అత్యంత శక్తివంతమైన హరికేన్ గా, ఫ్లోరిడాలోకి దూసుకొచ్చిన ఏడవ అత్యంత శక్తివంతమైన హరికేన్ గా ఇది నిలించిందని అంటున్నారు. ఈ తుఫాను కారణంగా ఇప్పటివరకూ 44 మంది మృతి చెండినట్లు చెబుతున్నారు.

అవును... అతి తీవ్రమైన హరికేన్ హెలెనా ఆగ్నేయ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి - 4 హరికేన్ ప్రభావం అధికంగా ఉందని చెబుతున్నారు. ఈ తుఫాను కారణంగా సుమారు 15 నుంచి 25 బిలియన్ డాలర్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మృతులు కనీసం 44 మందని అధికారులు ధృవీకరించారు!

మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బందితో పాటు ఓ మహిళ, నెల వయసున చిన్నారి సైతం ఉన్నట్లు వెల్లడించారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో అత్యవసర ప్రకటనలను ఆమోదించారు.

ఈ సందర్భంగా స్పందించిన గవర్నర్ బ్రియాన్ కెంప్... దక్షిణ జార్జియా నగరంలోని వాల్డోస్టాలో 115 నిర్మాణాలు హెలెన్ కారణంగా దెబ్బతిన్నాయని.. వాటి లోపల చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారని అన్నారు. ఫ్లోరిడాలో తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీచినత్లు అధికారులు పేర్కొన్నారు.

ఫ్లైట్ అవేర్, ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్స్ ప్రకారం... శుక్రవారం మధ్యాహ్నం నాటికి 900 కంటే ఎక్కువ యూఎస్ విమానాలు రద్దు చేయబడగా.. 3,300 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యం అయ్యాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలైన జార్జియా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, వర్జీనియాల్లో సుమారు 3.5 మిలియన్ల మంది విద్యుత్ లేకుండా ఉండిపోయారు.

Tags:    

Similar News