వీళ్లు గొప్పోళ్లు!

ఇక వీరంతా ప్రధానంగా విద్య, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం దానాలు చేశారు.

Update: 2024-11-08 03:45 GMT

సంపద సృష్టించడం మాత్రమే గొప్ప పని కాదు.. ఆ సంపదను నాలుగు మంచి పనులకు వాడుతూ, నలుగురికి ఉపయోగపడే వాటికి ఖర్చు చేస్తూ, సమాజంపట్ల బాధ్యత ఎరిగి, సాటి మనిషి పట్ల దయా గుణం కలిగి ఉన్నవాడే నిజమైన శ్రీమంతుడు అని అంటుంటారు. అలాంటి శ్రీమంతులు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. ఆ జాబితా ఇప్పుడు చూద్దాం...!

"ఊరు చాలా ఇచ్చింది.. ఎంతోకొంత తిరిగి ఇచ్చెయాలి" అనే విషయం ఏనాడో తెలుసుకున్నారో... "సాటి మనిషికి సాయపడకపోతే మనం భూమ్మీద సంఘంలో బతకడం ఎందుకు?" అని ఏనాడో తమను తాము ప్రశ్నించుకున్నారో తెలియదు కానీ... ఈ సమాజంలో చాలా మంది ధనవంతులు వితరణ విషయంలో "శ్రీమంతులు"గా మారుతున్నారు.

అవును... భారత్ కు చెందిన జమ్షెడ్జ్ టాటా ($102.4 బిలియన్స్), బిల్ గేట్స్ ($75.8 బిల్యన్స్), వారెన్ బఫెట్ ($32.1 బిలియన్స్), జార్జ్ సోరోస్ ($32 బిలియన్స్), అజీం ప్రేం జీ ($21 బిలియన్స్), మైఖెల్ బ్లూంబెర్గ్ ($12.7 బిల్లియన్స్), ఎలాన్ మస్క్ ($7.6 బిలియన్స్) విరాళాలు ఇచ్చిన వారిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా... 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్ వ్యవస్థాపకులైన శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. 2022-23 కంటే 5% అధికంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్లు దానం చేసింది..

ఈ మేరకు "ఎడెల్ గివ్ – హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితా - 2024" లో ఈ విషయాలను వెల్లడించింది. ఈ జాబితాలో శివ్ నాడార్ ఫ్యామిలీ తర్వాత స్థానాల్లో ముకేష్ అంబానీ, బజాజ్ కుటుంబం, కుమార్ మంగళం బిర్లా, గౌతం అదానీ కుటుంబం ఉన్నాయి. ఈ జాబితాలో రూ.5 కోట్లకంటే ఎక్కువ ఇచ్చినవారి సంఖ్య 203 గా ఉంది.

అయితే... దేశీయ సంపన్న వ్యాపార కుటుంబాల జాబితాలో రూ.3.14 లక్షల కోట్లతో అదానీ (రూ.11.6 లక్షల కోట్లు), ముకేష్ అంబానీ (రూ.10.14 లక్షల కోట్లు) తర్వాత మూడో స్థానంలో ఉండగా... వితరణ విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్నారు. ఇక వీరంతా ప్రధానంగా విద్య, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం దానాలు చేశారు.

“ఎడెల్ గివ్ – హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితా – 2024” టాప్ 10 జాబితా:

శివ్ నాడార్ కుటుంబం - రూ.2,153 కోట్లు

ముకేష్ అంబానీ కుటుంబం - రూ.407 కోట్లు

బజాజ్ కుటుంబం - రూ.352 కోట్లు

కుమార మంగలం బిర్లా - రూ.334 కోట్లు

గౌతం అదానీ కుటుంబం - రూ.330 కోట్లు

నందన్ నిలేకని - రూ.307 కోట్లు

కృష్ణ చివుకుల - రూ.228 కోట్లు

అనిల్ అగర్వాల్ కుటుంబం - రూ.181 కోట్లు

సుస్మిత, సుబ్రతో బాగ్చి - రూ.179 కోట్లు

రోహిణీ నీలేకని - రూ.154 కోట్లు

Tags:    

Similar News