హైదరాబాద్ లో "సన్ బర్న్"... పోలీస్ కమిషనర్ రియాక్షన్ ఇదే!
అవును... అత్యంత వివాదాస్పద ఈవెంట్ గా చెప్పుకునే "సన్ బర్న్" కార్యక్రమాన్ని ఈసారి మాదాపూర్ లో నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో "సన్ బర్న్" పేరుతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఈవెంట్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో జరిగినా వివాదాలు చుట్టుముట్టే ఈ ఈవెంట్ ను.. ఈసారి మాదాపూర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఈ ఈవెంట్ పై గతంలో కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వచ్చిన రియాక్షన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సమయంలో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు!
అవును... అత్యంత వివాదాస్పద ఈవెంట్ గా చెప్పుకునే "సన్ బర్న్" కార్యక్రమాన్ని ఈసారి మాదాపూర్ లో నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి! ఈ సమయంలో ఈ ఈవెంట్ కు అనుమతి లేకుండానే... ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్మకానికి పెట్టేశారు. ఇందులో భాగంగా బుక్ మై షోలో మాదాపుర్ సన్ బర్న్ ఈవెంట్ టిక్కెట్లు అమ్మకానికి ఉన్నాయి. ఈ విషయంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారని తెలుస్తుంది.
తాజాగా జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఈ ఈవెంట్ కు అనుమతి ఎవరిచ్చారంటూ సీఎం సీరియస్ గా ప్రశ్నించారని.. అనుమతి ఇవ్వకుండా ఆన్ లైన్ లో టిక్కెట్లు ఎలా అమ్ముతారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఈ విషయాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి స్పందించారు.
ఇందులో భాగంగా... నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో నిర్వహించే సన్ బర్న్ ఈవెంట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనుమతులు ఇవ్వకముందే ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయంలో పాలుపంచుకున్న వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే సంకేతాలు ఇచ్చారు!
ఇదే క్రమంలో... బుక్ మై షో ప్రతినిధులను కూడా హెచ్చరించామని తెలిపిన అవినాష్ మెహంతీ... సన్ బర్న్ ఈవెంటుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయమని సూచించామని తెలిపారు. అనధికార టిక్కెట్ల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో ఈసారి హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ పై ఒక క్లారిటీ వచ్చినట్లేనని అంటున్నారు!
కాగా... గతంలో సన్ బర్న్ ఈవెంట్ హైదరాబాద్ లో పలుమార్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇందులో భాగంగా... 2017లో గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ ను నిర్వహించినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ముందు ధర్నాకు దిగారు.
ఇదే సమయంలో... గతేడాది శంషాబాద్ లో కూడా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్న సమయంలో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. సన్ బర్న్ ఈవెంట్ కు లిక్కర్ పర్మిషన్ కూడా ఉండటంతో... ఆ మాటున డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తారని, ఇది అనేక నేరాలకు దారి తీస్తుందని ఆరోపించారు. ఈ సమయంలో తాజాగా ఈ ఈవెంట్ పై రేవంత్ రెడ్డి ఫైరయ్యారని తెలుస్తుంది.