డేంజర్ బెల్స్... భాగ్యనగరానికి భారీ కష్టం రాబోతోందా?

ఈ ఏడాది వేసవి ఎంటరయ్యింది.. మే నెల ఎండలు, రోహిణీ కార్తి వడగాల్పులకు ఇంకా సమయం ఉండగానే

Update: 2024-04-07 05:13 GMT

ఈ ఏడాది వేసవి ఎంటరయ్యింది.. మే నెల ఎండలు, రోహిణీ కార్తి వడగాల్పులకు ఇంకా సమయం ఉండగానే... ఇప్పటికే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి. దీంతో... రానున్న రోజుల్లో ఇంకా ఏ స్థాయిలో ఉండబోతుందో ఈ ప్రభావం అంటూ ఆదోళనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో భాగ్యనగరానికి బిగ్ అలర్ట్ తెరపైకి వస్తోందని తెలుస్తుంది.

అవును... హైదరాబాద్ కి నీటి కష్టాలు అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది! ఇప్పటికే బెంగళూరు నీటి ఎద్దడితో అల్లాడుతోన్న్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల వెల్లడించిన ఒక అధ్యయనంలో కాంక్రీట్ నిర్మాణాలు సుమారు పదిరెట్లు పెరగడం వల్లే నీటి మట్టాలు సుమారు 79శాతం తగ్గుముఖం పట్టాయని తెలిపింది! దీంతో... హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది.

ఇదే సమయంలో... బెంగళూరు పట్టణ విస్తరణ 1973 లోని 8 శాతం నుంచి 2023లో 93.3 శాతానికి పెరిగిందని.. ఈ మేరకు నీటి వరనురులు పెరగలేదని వెల్లడించిన ఈ అధ్యయనం... పట్టణాల విస్తరణ పెరగడానికి - నీటి మట్టాలు తగ్గడానికీ బలమైన సంబంధాన్ని హైలెట్ చేసింది. ఇలా పట్టణం అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోవడం వల్ల నీరు ఉకికే అవకాశం లేదని చెబుతుంది!

ఈ సమయంలో హైదరాబాద్ పరిస్థితి చర్చకు వస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల మేరకు.. హైదరాబాద్ లో 185 నోటిఫైడ్ వాటర్ బాడీలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే... వీటిలో ఎక్కువశాతం భారీగా కలుషితం అవ్వగా.. సుమారు 20 వనరులు పూర్తిగా ఎండిపోయాయని అంటున్నారు. ఫలితంగా... హైదరాబాద్ లో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో... ఇప్పటికే సిటీ అవుట్ కట్స్ లలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని చెబుతున్న నేపథ్యంలో... ఇప్పటికైనా వర్షపు నీటిని భూమిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా... 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి గుంటలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News