సీసీటీవీ కవరేజీలో హైదరాబాద్‌ టాప్... డిటైల్స్ ఇవే!

అవును... హైదరబాద్ దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా రికార్డు సాధించింది.

Update: 2023-09-28 00:30 GMT

విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కు మరో కిరీటం వచ్చి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో భాగంగా దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్‌ రికార్డు సాధించింది. ఇదే సమయంలో ప్రపంచ టాప్‌-50 నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది.

అవును... హైదరబాద్ దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా రికార్డు సాధించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 నగరాల జాబితాలో భారత్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ 22వ స్థానంలో నిలవగా... అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ 41వ స్థానలో నిలిచింది.

అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను రూపొందించిన ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సంస్థ... తాజా జాబితాను ఆన్ లైన్ వేదికగా విడుదల చేసింది. జనాభా, నగర విస్తీర్ణం ప్రాతిపధికగా ఏర్పాటైన సీసీ కెమెరాల అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో భాగ్యనగరానికి కు ఉత్తమ స్థానం దక్కింది.

హైదరాబాద్‌ లో 1.6 చదరపు కిలోమీటర్ల పరిధిలో 321 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ 1.6 చదరపు కిలోమీటర్ల పరిధిలో 1,490 కెమెరాలను కలిగి ఉంది. ఫలితంగా టాప్ 50లో 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 62 శాతం హైదరాబాద్‌ నగరంలో ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలడం!

ఫలితంగా సిటీ వ్యాప్తంగా సుమారు 5 లక్షల సీసీ కెమెరాలను ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. ఇక.. వీటి నిర్వహణ, పర్యవేక్షణ, మరమ్మత్తుల కోసం కెమెరా మెయింటెనెన్స్‌ ఆర్గనైజేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను సిటీ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 54 శాతం కెమెరాలు ఒక్క చైనాలోనే ఉండగా.. మిగిలిన 46 శాతం కెమెరాలు 150కిపైగా దేశాలు కలిగి ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైందని తెలుస్తుంది. ఇదే క్రమంలో... అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు ఉన్నాయి!

Tags:    

Similar News