మన చిన్నప్పుడు ఈజీగా దొరికే తాటిముంజ ఇప్పుడెందుకంత కాస్లీ అయ్యింది?
ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినాలి. అది ఆరోగ్యానికి మంచిది. పండ్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినాలి. అది ఆరోగ్యానికి మంచిది. పండ్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సహజమైన ఆహారం కావడంతో పండ్లు ఎక్కువగా తింటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. దీని కోసం ఇప్పుడు చాలా మందిలో మార్పు వస్తోంది. పండ్లు తినడానికే ఇష్టపడుతున్నారు. పండ్ల వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకుంటున్నారు.
వేసవి కాలంలో మనకు తాటిముంజలు వస్తాయి. వాటిని తినేందుకు అందరు ఇష్టపడతారు. మన ఆరోగ్య పరిరక్షణలో అవి కీలకంగా ఉంటాయి. అలాంటి ముంజలు ప్రస్తుతం కరువవుతున్నాయి. పూర్వం రోజుల్లో తాటిముంజలు పుష్టిగా తినేవారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉండేది. ఈనేపథ్యంలో తాటిముంజలు తినడానికి ఎంతో ఉత్సాహం చూపడం సహజమే.
తాటిముంజలు మన శరీరంలో ఉండే వేడని చల్లారుస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. సహజసిద్ధమైన ఆహారం కావడంతో వాటిని తినేందుకు చాలా మంది మొగ్గు చూపడం కామనే. ఈ క్రమంలో తాటి ముంజలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. కానీ వాటిని విక్రయించే వారే కరువయ్యారు. దీంతో వాటి ధర ప్రస్తుతం ఎక్కువగా ఉండటంతో ముంజలు దొరకడం లేదు.
తాటి చెట్లు ఎక్కే వారు కరువయ్యారు. మెల్లమెల్లగా వారి తరం అంతరిస్తోంది. పూర్వం రోజుల్లో గౌడ కులం వారు ఈ పని చేసేవారు. ఇప్పుడు అందరు కాకుండా కొందరే చేస్తున్నారు. దీంతో తాళ్లు ఎక్కే మనుషులు కరువవుతున్నారు. దీంతోనే తాటిముంజల కొరత వస్తోంది. ఒక్కో కాయ రూ.50 వరకు పలుకుతోంది. అందుకే ముంజల ధర కొండెక్కుతోంది.
రాబోయే రోజుల్లో తాటిముంజల కొరత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. చెట్లు ఎక్కే వారి సంఖ్య తగ్గడంతో తాటి ముంజలు దొరకడం లేదు. దీని వల్ల వాటిని తినే భాగ్యం మనకు కలగడం లేదు. దీని వల్ల మన ఆరోగ్యం మీద ప్రభావం చూపడం ఖాయం. తాటి ముంజలు మనకు ఎక్కువగా లభించాలంటే వాటిని కోసే వారు కూడా ఉండాలి. ఇప్పటి తరం కూడా ఎక్కువ మంది తాటి చెట్లు ఎక్కడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.