ఐఐటీ బాబాపై అటాక్.. బీప్ సౌండ్స్.. వీడియో వైరల్!

ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకుని బాబాగా మారిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ కు తాజాగా బిగ్ షాక్ తగిలింది.;

Update: 2025-03-01 06:16 GMT

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ మేళా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మహాకుంభ మేళాలో వెరైటీ వెరైటీ సాధువులు, సన్యానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని అంటున్నారు. వారిలో ఒకరు అభయ్ సింగ్ అలియాస్ ఐఐటీ బాబా. తాజాగా ఈయనను నొయిడాలోని ఓ టీవీ డిబెట్ లో కర్రలతో కొట్టారు.

అవును... ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకుని బాబాగా మారిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా... ఆయనపై కొంతమంది వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. ఓ టీవీ ఛానల్ డిబెట్ లో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది!

వివరాళ్లోకి వెళ్తే... ఐఐటీ బాబా అభయ్ సింగ్ తాజాగా ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లో డిబేట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో డిబేట్ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో అభయ్ సింగ్ తో వారు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అతడు బయటకు వెళ్లిపోతుంటే వెంటాడారు!

ఈ సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తులు.. అభయ్ సింగ్ ను పాకిస్థాన్ ఏజెంట్ అంటూ కూడా వ్యాఖ్యానించినట్లు వీడియోలు వినిపిస్తుంది! ఈ ఘటన అనంతరం డిబేట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అభయ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అంతకు ముందు స్టూడియోలోనే కాసేపు బైఠాయించారు.

ఈ సమయంలో వారందరి మధ్య వాగ్వాదం జరిగింది! దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది! ఈ వీడియోలో కాషాయ దుస్తులు ధరించిన వారు చేసిన వ్యాఖ్యలకు బీప్ సౌండ్ వేయడం గమనార్హం అని అంటున్నారు నెటిజన్లు!

ఈ సందర్భంగా... కాషాయ దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు న్యూస్ రూమ్ లోకి ప్రవేశించారని, తనతో దురుసుగా ప్రవర్తించి కర్రలతో కొట్టారని ఐఐటీ బాబా.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన సెక్టార్ 126లోని పోలీస్ అవుట్ పోస్ట్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసులు నచ్చజెప్పి పంపించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News