నోబెల్ ప్రైజ్ రేసులో జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌.. నామినేషన్ వెనుక ఎవరున్నారు?

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలలో ఒకటైన నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు.;

Update: 2025-04-01 09:30 GMT
Imran Khan Nominated Nobel Peace Prize

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలలో ఒకటైన నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. శాంతి రంగంలో ఆయన చేసిన కృషికి గానూ ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించారు. దక్షిణ ఆసియాలో శాంతిని ప్రోత్సహించడానికి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషికి ఈ నామినేషన్ లభించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ 2022 నుంచి అవినీతి కేసులో పాకిస్తాన్ లో జైలు జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతికి వ్యక్తులను ఎవరు నామినేట్ చేస్తారు? దాని ఎంపిక ప్రక్రియ ఏమిటి? ఈ సంవత్సరం ఎంత మంది నామినేట్ అయ్యారు లాంటి ప్రశ్నలు చాలా మంది మదిలో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ ఏడాది నామినేట్ అయిన వాళ్లు

నోబెల్ బహుమతి 2025 కోసం నామినేషన్ల చివరి తేదీ జనవరి 31. ఈసారి 338 మందిని నామినేట్ చేసినట్లు నోబెల్ ప్రైజ్ అందించచే సంస్థ తెలిపింది. వీరిలో 244 మంది వ్యక్తులు కాగా, 94 సంస్థలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నామినేషన్లు భారీగా పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది. 2024లో 286 మంది నామినేట్ అయ్యారు. అత్యధికంగా 2016లో 376 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లలో వచ్చిన పేర్లన్నింటినీ సంస్థ గోప్యంగా ఉంచుతుంది. తదుపరి 50 ఏళ్ల వరకు వాటిని బహిర్గతం చేయదు.

ఇలా ఉంటుంది పూర్తి ప్రక్రియ

నోబెల్ బహుమతి కోసం నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్‌లోనే మొదలవుతుంది. నోబెల్ బహుమతికి నామినేషన్ దాని ప్రమాణాలను పూర్తి చేసే వ్యక్తి మాత్రమే చేయగలరు. నామినేషన్ ప్రక్రియ జనవరి 31 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఎటువంటి నామినేషన్లను స్వీకరించరు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నార్వేజియన్ నోబెల్ కమిటీ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు వ్యక్తుల పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి జాబితాను తయారు చేస్తుంది. ఈ జాబితాను మార్చి నుంచి ఆగస్టు వరకు సలహాదారుల రివ్యూ కోసం పంపిస్తారు. సలహాదారుల సమీక్ష పూర్తయిన తర్వాత, అక్టోబర్‌లో ఓటింగ్ ద్వారా వ్యక్తుల పేర్లను ఖరారు చేస్తారు. తర్వాత వారి పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత డిసెంబర్‌లో నోబెల్ ప్రైజ్ ప్రదానోత్సవం జరుగుతుంది.

Tags:    

Similar News