డిజిటల్ భారతం.. యూపీఐతో ప్రపంచ రికార్డు.. నగదుకు ఇక సెలవు!

భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగం ఊహించని స్థాయికి చేరుకోవడంతో.. నగదు రహిత లావాదేవీల్లో భారత్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. చిన్న మొత్తాల కొనుగోళ్ల నుంచి పెద్ద మొత్తాల వ్యాపారాల వరకు ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతుండడంతో నగదు వినియోగం దాదాపుగా కనుమరుగైపోయింది. కూరగాయలు, పాలు, పూలు వంటి నిత్యవసర వస్తువుల కొనుగోలుతో పాటు కేవలం ఒక్క రూపాయి లేదా పది రూపాయల వంటి అతి చిన్న మొత్తాలను కూడా ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. దుకాణదారులు సైతం నగదు నిర్వహణ, చిల్లర సమస్యల నుంచి విముక్తి పొందడానికి డిజిటల్ చెల్లింపులనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈ వేగవంతమైన మార్పు యూపీఐ లావాదేవీల సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2025 నాటికి యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం అక్షరాలా రూ. 24.77 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. అంతేకాకుండా, రోజువారీ సగటు లావాదేవీల విలువ రూ. 79,903 కోట్లుగా నమోదైంది. ఇది డిజిటల్ చెల్లింపులపై భారతదేశం ఎంతగా ఆధారపడి ఉందో తెలియజేస్తోంది. ఒకప్పుడు సౌకర్యంగా ప్రారంభమైన యూపీఐ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. చిన్నచిన్న వీధి వ్యాపారులు సైతం తమ వద్ద నగదు పెట్టెల స్థానంలో QR కోడ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. యూపీఐ తక్షణ చెల్లింపుల సౌలభ్యం దీనిని భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మార్చేశాయి. భారతదేశం ఆర్థికంగా వెనుకబడిన వారిని కలుపుకొని పోవడంలో, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. యూపీఐ లావాదేవీల ఈ స్థాయిని ప్రపంచంలో ఏ ఇతర దేశం కూడా చేరుకోలేకపోవడంతో, ఇది భారతదేశానికి నిజమైన ప్రపంచ రికార్డుగా నిలిచింది. ఈ ఘనత భారతదేశ డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.;

Update: 2025-04-03 04:46 GMT
డిజిటల్ భారతం.. యూపీఐతో ప్రపంచ రికార్డు.. నగదుకు ఇక సెలవు!

భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగం ఊహించని స్థాయికి చేరుకోవడంతో.. నగదు రహిత లావాదేవీల్లో భారత్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. చిన్న మొత్తాల కొనుగోళ్ల నుంచి పెద్ద మొత్తాల వ్యాపారాల వరకు ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతుండడంతో నగదు వినియోగం దాదాపుగా కనుమరుగైపోయింది.

కూరగాయలు, పాలు, పూలు వంటి నిత్యవసర వస్తువుల కొనుగోలుతో పాటు కేవలం ఒక్క రూపాయి లేదా పది రూపాయల వంటి అతి చిన్న మొత్తాలను కూడా ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. దుకాణదారులు సైతం నగదు నిర్వహణ, చిల్లర సమస్యల నుంచి విముక్తి పొందడానికి డిజిటల్ చెల్లింపులనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.

ఈ వేగవంతమైన మార్పు యూపీఐ లావాదేవీల సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2025 నాటికి యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం అక్షరాలా రూ. 24.77 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. అంతేకాకుండా, రోజువారీ సగటు లావాదేవీల విలువ రూ. 79,903 కోట్లుగా నమోదైంది. ఇది డిజిటల్ చెల్లింపులపై భారతదేశం ఎంతగా ఆధారపడి ఉందో తెలియజేస్తోంది.

ఒకప్పుడు సౌకర్యంగా ప్రారంభమైన యూపీఐ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. చిన్నచిన్న వీధి వ్యాపారులు సైతం తమ వద్ద నగదు పెట్టెల స్థానంలో QR కోడ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. యూపీఐ తక్షణ చెల్లింపుల సౌలభ్యం దీనిని భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మార్చేశాయి.

భారతదేశం ఆర్థికంగా వెనుకబడిన వారిని కలుపుకొని పోవడంలో, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. యూపీఐ లావాదేవీల ఈ స్థాయిని ప్రపంచంలో ఏ ఇతర దేశం కూడా చేరుకోలేకపోవడంతో, ఇది భారతదేశానికి నిజమైన ప్రపంచ రికార్డుగా నిలిచింది. ఈ ఘనత భారతదేశ డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News