ఇండియా గెలుపనే అనుకోవాలా ?

మణిపూర్ అల్లర్లపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రతిపక్ష ఇండియా కూటమి

Update: 2023-07-27 04:32 GMT

మణిపూర్ అల్లర్లపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రతిపక్ష ఇండియా కూటమి సాదించబోయేది ఏమిటి ? ప్రభుత్వం ఏమన్నా కూలిపోతుందా ? ప్రభుత్వాన్ని కూల్చేసేంత సీన్ ఇండియా కూటమికి ఉందా ? అనే చర్చలు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఓకే చేశారు. అన్నీపార్టీలతో కలిసి చర్చలకు ఒక తేదీని నిర్ణయిస్తానని స్పీకర్ ప్రకటించారు. బహుశా ఒకటి రెండు రోజుల్లోనే చర్చకు స్పీకర్ అనుమతించే అవకాశం ఉందంటున్నారు. బహుశా ఇండియా కూటమి సాధించిన మొదటి విజయమని అనుకోవాలేమో.

నిబంధనల ప్రకారం ప్రతిపక్షాల నేతలు సభలో మాట్లాడిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ ద్వారా అయ్యేదీ లేదు పోయేదీ లేదు. కాకపోతే కొన్ని గంటలపాటు మణిపూర్ అంశంమీదే సభలో చర్చ జరుగుతుంది ఆ చర్చల్లో మణిపూర్లో అల్లర్ల తాలూకు వేడి కేంద్రప్రభుత్వానికి తగులుతుంది, అల్లర్లకు కారణాలు, ప్రభుత్వ వైఫల్యం, ఘటనల వాస్తవాలు లాంటి అనేక అంశాలు చర్చకు వస్తాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం అంటే నరేంద్రమోడీ సమాధానం చెప్పితీరాలి. మోడీ సమాధానంతో అవిశ్వాసతీర్మానంపై చర్చ ముగుస్తుంది.

మామూలుగా అయితే మణిపూర్లో ఘటనలపై సభలో చర్చకు స్పీకర్ అనుమతించి ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉండేవికావు. కానీ అందుకు అధికారపార్టీ అనుమతించలేదు. మణిపూర్లో అల్లర్లపై పార్లమెంటులో చర్చించాలంటేనే ప్రభుత్వం భయపడుతోంది. చర్చకు అనుమతిస్తే ప్రతిపక్షాలు కేంద్రాన్ని వాయించేస్తాయని మోడీకి బాగా తెలుసు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వ, మోడీ వైఫల్యాలను ఎండగట్టడానికి దొరికే ఏ అవకాశాన్ని ప్రతిపక్షాలు వదులుకోవు.

ప్రతిఫక్షాల ధాటిని తట్టుకుని సమాధానం చెప్పలేకే మోడీ చర్చకు కుదరదని చెప్పిస్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాల్సిన అగత్యం ఏర్పడింది. దీన్న కూడా తిరస్కరిస్తే ప్రతిపక్షాలన్నీ కలిసి పార్లమెంటు సమావేశాలను బహిష్కరించే అవకాశముంది. అది మోడీకి ఇంకా అవమానం. అందుకనే వేరేదారిలేక అవిశ్వాసతీర్మానాన్ని ఆమోదించింది. అవిశ్వాసతీర్మానం వల్ల ఓటింగ్ లో ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీలేదు. కాకపోతే చర్చల సందర్భంగా మోడీ వ్యవహారశైలిని, ఫెయిల్యూర్ ను ప్రతిపక్షాలు ఎండగట్టడం ఖాయం. మరి చర్చ ఏ విధంగా ముగుస్తుందో చూడాలి.

Tags:    

Similar News