ఇండియా కూటమి ధర్నా విజయవంతం అవుతుందా?

మన దేశ పార్లమెంట్ పై దాడి ఘటన నేపథ్యంలో లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ధర్నా చేయడానికి నిర్ణయించింది.

Update: 2023-12-22 05:51 GMT

మన దేశ పార్లమెంట్ పై దాడి ఘటన నేపథ్యంలో లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ధర్నా చేయడానికి నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ధర్నా చేయాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే నేడు మధ్యాహ్నం ఇందిరా పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ధర్నా చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేయడానికి రేవంత్ రెడ్డి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ధాన్యం కొనుగోలు అంశంపై సీఎం హోదాలో కేసీఆర్ కూడా ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా తన మంత్రులతో కలిసి ధర్నా చేసేందుకు ఇండియా కూటమి పిలుపునందుకు ధర్నా చేయడంతో అందరి ఫోకస్ దీని మీదే పడుతోంది.

లోక్ సభలో ఆందోళన చేస్తున్న ఎంపీలను సస్పెన్షన్ కు గురి చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు. పార్లమెంట్ లో సెక్యూరిటీ లోపాల గురించి ఇండియా కూటమి నిరసన తెలియజేయాలని భావించింది.

ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ పై దాడిపై ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేసినా వారు స్పందించలేదు. దీంతో ఎంపీలు ఆందోళన చేపట్టారు. వారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం గమనార్హం. నిరసన చేసిన 40 మంది మంత్రులను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సూచించింది.

ఇందిరాపార్క్ వద్ద సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలతో కలిసి ధర్నా చేయడానికి వస్తున్నారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో క్రిస్ మస్ వేడుకల్లో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి ఇండియా కూటమి ఆదేశాలను పాటిస్తూ ధర్నా చేసి తమ నిరసన తెలియజేసేందుకు రెడీ అవుతున్నారు. నేతలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని చూస్తున్నారు.

Tags:    

Similar News