భారతీయుల్లో బహు భాగస్వామ్యం... లెక్కలు మారుతున్నాయి!!

అవును... బహు భాగస్వామ్యంపై భారతీయుల్లో ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతుందంట.

Update: 2024-03-14 04:05 GMT

రోజులు మారాయని చెబుతుంది తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సర్వే! భారత్ లో పెళ్లి ఎంతో పవిత్రమైన కార్యం అయినప్పటికీ.. వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెప్పుకుంటున్నప్పటికీ.. భారత్ లోని వైవాహిక వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం అని అంటున్నప్పటికీ.. తెరవెనుక యవ్వారం వేరేగా ఉందని తెలుస్తుంది! తాజాగా విడుదలైన ఒక సర్వే చెబుతున్న లెక్కలు పైన చెప్పుకున్న విషయాలకు చాలా భిన్నంగా ఉన్నాయని తెలుస్తుంది.

అవును... బహు భాగస్వామ్యంపై భారతీయుల్లో ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతుందంట. ఈ జీవితం ఒక్కరికే అంకితం అనే రోజులు మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయట. అందుకు గల కారణాలు ఏవైనప్పటికీ.. ఎన్నైనప్పటికీ.. పక్క చూపులు చూడటం అనేది భారతదేశంలోని వివాహితులకు అలవాటుగానో, ఫ్యాషన్ గానో మారుతున్న దశ వచ్చేసిందని చెబుతుంది తాజా సర్వే! దీంతో.. ఈ విషయంపై ఇంకా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... బహు భాగస్వామ్యంపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతుందని గ్లీడన్ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. తాజాగా 1,500 మందికి పైగా వివాహితుల్లో చేపట్టిన సర్వేలో సుమారు 60శాతం మంది.. తమ భాగస్వాములను మార్చుకోవడం వంటి మోడ్రన్ పద్దతులను ఫాలో అయినట్లు చెప్పుకొచ్చారంట. ఇదే సమయంలో 46% మంది పురుషులు మరొకరితో మానసిక బంధం కావాలని కోరుకుంటున్నారని తేలిందంట.

ఇదే క్రమంలో భారతీయ మహిళలు ఈ విషయంలో చాలా ఓపెన్ అయిపోతున్నారని చెబుతున్న ఈ సంస్థ... ఆన్ లైన్ ఫ్లర్టింగ్ పై పురుషుల్లో 35% మంది ఆసక్తిని కనబరుస్తుండగా.. మహిళలు ఇంకాస్త ఎక్కువగా 36% మంది ఆసక్తిని కనబరుస్తున్నారట. అయితే వైవాహిక జీవితంలో ఏ కారణంతో మరో భాగస్వామిని వెతుక్కుంటున్నారనే విషయంపై మాత్రం ఈ సర్వే ఎలాంటి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదని తెలుస్తుంది.

అయితే... భారతదేశంలోని పలువురు మహిళలు మాత్రం వివాహేతర లైంగిక సంబంధాలను కోరుకుంటున్నారని.. ఒక జీవితం ఒకే భర్త అనే కాన్సెప్టును లైట్ తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలిందట. అయితే ఈ తరహా బంధాలు... భార్యభర్తల బంధంలో కమ్యునికేషన్ సరిగ్గా లేకపోవడం, ఎమోషనల్ మద్దతు దొరకకపోవడం వల్ల వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు!

ఇదే సమయంలో... అతి తక్కువమంది సినిమాల ప్రభావంతోనో, పాశ్చాత్య పోకడల ప్రభావంతోనో ఆ తరహా వ్యవహారాన్ని ఫ్యాషన్ గా చూస్తే చూడొచ్చు కానీ... ఎక్కువ మంది మాత్రం... భాగస్వామి తరచూ నిర్లక్ష్యం చేయడం, శ్రద్ధ ఆసక్తి కనబరచకపోవడం, అనుమానించడం, అవమానించడం, ప్రశంసించకపోవడం, ప్రేమించకపోవడం వంటి కారణాలవల్లే వివాహేతర సంబంధాల వైపు ఆలోచిస్తున్నారని, ఆచరణలో పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!

Tags:    

Similar News