ఉగ్రవాదుల చేతిలో డాగ్ "ఫాంటమ్" వీరమరణం.. త్యాగానికి వందనం!
అవును... బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన డాగ్ ఫాంటమ్ అనే శునకం 2020 మే 25న జన్మించింది.
జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు - భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ దారుణం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ఫాంటమ్ అనే శునకం వీరణం పొందింది.
అవును... బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన డాగ్ ఫాంటమ్ అనే శునకం 2020 మే 25న జన్మించింది. ప్రత్యెకంగా దాడి చేసే శునకంగా ట్రైనింగ్ పొందిన ఫాంటమ్.. 2022 లో ఇండియన్ ఆర్మీలో చేరింది. ఈ సందర్భంగా స్పందించిన ఇండియన్ అర్మీ అధికారి ఒకరు.. డాగ్ ఫ్యాంటమ్ త్యాగాన్ని కొనియాడారు.
ఇందులో భాగంగా... మన నిజమైన హీరో, ధైర్యవంతులైన ఇండియన్ ఆర్మీ డాగ్ ఫ్యాంటమ్ త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాము అని అన్నారు. దగ్గర నుంచి శత్రు లక్ష్యాలపై గూఢచర్యం చేయడానికి సహరించే గాడ్జెట్ లు ఈ ఆర్మీ డాగ్స్ లలో అమర్చబడి ఉంటాయి.
కాగా... జమ్మూ నగరానికి 85 కి.మీ. దూరంలో ఉన్న అఖ్నూర్ ఖుర్ యుద్ధ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తర్వాత సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో ఫ్యాంటమ్ శత్రువుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది.. ఫ్యాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరువలేనిది అని వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ చేసింది.
ఇక ఈ భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిలో ఒక ఉగ్రవాది మరణించగా.. అతడు ఆర్మీ దుస్తుల్లు ధరించినట్లు చెబుతున్నారు. ఈ ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ సమయంలో భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.