"హాలోవీన్" సందడిలో సడేమియా... (భారతీయ) మహిళ దొంగతనం వీడియో వైరల్!
తాజాగా ఈ వేడుకల్లో దొంగతనం చేసిందని చెబుతున్న ఓ మహిళ వీడియో హల్ చల్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా జరిగే చాలా రకాల వేడుకల్లో ఎంతో విభిన్నంగా ఉండే వేడుక "హాలోవీన్" అంటారు. సాధారణంగా కొత్త దుస్తులు ధరించి, దైవర ప్రార్థనలు చేసే వేడుకలకు భిన్నంగా... ఈ వేడుకల్లో చిన్నా, పెద్దా అంతా రాక్షసులు, దెయ్యాల దుస్తులు ధరిస్తుంటారు. ఇతరులను భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
ఈ క్రమంలో అత్యంత సందడిగా జరిగిన ఈ ఏడాది హాలోవీన్ వేడుకల్లో 'మెటా' అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఈ వేడుకల్లో దొంగతనం చేసిందని చెబుతున్న ఓ మహిళ వీడియో హల్ చల్ చేస్తోంది.
అవును... అత్యంత సందడిగా జరిగిన హాలోవీన్ వేడుకల్లో రాత్రి ఓ మహిళ దొంగతనం చేస్తూ కనిపించిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన కెనడాలోని పొరుగున ఉన్న అనేక ఇళ్లల్లో క్యాండీలు, డెకరేషన్ లైట్లు దొంగిలిస్తున్నట్లున్న ఓ మహిళ కు సంబంధించిన సీసీ టీవి ఫుటేజ్ వీడియో తెరపైకి వచ్చింది.
మార్కం అంటారియోలో సదరు మహిళ... కాండీలన్నింటినీ దొంగిలిస్తూ, వాటిని ఓ చెత్త బ్యాగ్ లో వేయడం పలు ఇళ్లల్లోని సీసి కెమెరాలలో రికార్డ్ చేయబడింది. ఆ వీడియోలో ఒకదానిలో ఆమె డెకరేషన్ లైట్ ఐటం ని కూడా తన బ్యాగ్ లో వేసుకోవడం కనిపించింది. దీంతో... ఇది పక్కా దొంగతనమే అని అంటున్నారు!
దీనికి సంబంధించిన వీడియో గత రాత్రి నుంచి నెట్టింట హల్ చల్ చేస్తోంది. చూడటానికి ఆమె భారతీయ మహిళలా ఉన్నారని అంటున్నారు. దీంతో... స్థానిక కెనడియన్ల నుంచి ఈ ఘటనపై జాత్యాహంకార వ్యాఖ్యలు మొదలుపెట్టేశారు!
ఇందులో భాగంగా... "భారతీయులు కెనడాను నాశనం చేశారు!" అని ఒకరు కామెంట్ చేస్తే... "మిఠాయిలు దొంగిలించాల్సిన పనికి పూనుకున్నారంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి ఉండాలి!" అని ఇంకొకరు స్పందించారు. "తమది కానిది తీసుకోవడం భారత్ లో ఒక సాంస్కృతిక విషయం!" అని మరొకరు కామెంట్ చేశారు!
దీంతో... అసలు విషయం, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలా ఒక మహిళ చేసిన పనిని పూర్తి దేశానికి అంటగట్టండం వారి పైత్యానికి, అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అంటూ మరికొంతమంది కామెంట్ పెడుతున్నారు.