బక్కచిక్కిపోతున్న రూపాయి... వారి సెంటిమెంట్ దెబ్బతింటుందా?
ఈ క్రమంలో... తాజాగా సోమవారం ఉదయం ఓపెనింగ్ ట్రేడ్ లో సరికొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది.
గత కొన్ని రోజులుగా అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి రోజురోజుకీ బక్కచిక్కిపోతోంది. ఈ క్రమంలో... తాజాగా సోమవారం ఉదయం ఓపెనింగ్ ట్రేడ్ లో సరికొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది. ఇందులో భాగంగా.. 23 పైసలు బలహీనపడి చరిత్రలో తొలిసారి 86.27కు చేరుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం 86.61 వద్ద స్థిరపడింది.
అవును... అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి ఇటీవల వరుసగా బక్కచిక్కిపోతూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం 86.61 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో... రుపాయి క్షీణత ఇలాగే కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశానికి ఇబ్బందులు తప్పవనె కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో.. పరిస్థితులు ఇలానే కొనసాగితే.. వాణిజ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయవచ్చని అంటున్నారు. ఫలితంగా... ఈ పరిస్థితులు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నాడు భారీ నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన సూచీలు రోజంతా కూడా అదేబాటలో పయనించాయి. ప్రధానంగా... ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.డీ.ఎఫ్.సీ. బ్యాంక్, ఎల్ & టీ, జొమాటో షేర్లలో విక్రయాలు సూచీలపై మరింత ఒత్తిడి పెంచిన పరిస్థితి.
ఫలితంగా... సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ 23,100 దిగువన ముగిసింది. ఈ సమహ్యంలో... టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ అండ్ బ్యాంక్, హెచ్.యూ.ఎల్. షేర్లు మాత్రమే లాభపడ్డాయి.