పిక్ వైరల్... ఇండియన్ మోనాలిసా ని చూశారా..?

మోనాలిసా చిత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినదనే సంగతి తెలిసిందే. 1503 - 1506 మధ్య డావిన్సీ దీనిని చిత్రించారని చెబుతారు.

Update: 2024-11-30 04:18 GMT

మోనాలిసా చిత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినదనే సంగతి తెలిసిందే. 1503 - 1506 మధ్య డావిన్సీ దీనిని చిత్రించారని చెబుతారు. ఇది పోప్లర్ ప్యానెల్ పై వేసిన ఆయిల్ పెయింటింగ్! ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ ఈ పెయింట్ ను స్వాధీనం చేసుకుని పారిస్ లోని లౌవ్రే మ్యూజియంలో శాస్వత ప్రదర్శనలో ఉంచినట్లు చెబుతారు.

ఈ పెయింట్ కోసం దాడులు చేసుకున్నారని.. యుద్ధాలు జరిగాయని చెబుతారు. ఈ క్రమంలోనే 1950 చివర్లో కొన్ని విధ్వంసాల వల్ల పెయింటింగ్ కొంచెం దెబ్బతిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఆ పెయింట్ గుర్తించారు. ఆమె పెదాలపై చిరునవ్వు చూడటానికి ఏటా లక్షలాదిమంది పారిస్ కు వస్తుంటారని చెబుతారు.

ఇక ఈ మోనాలిసాకు కనుబొమ్మలు ఎందుకు లేవనేది చాలామందికి అనుమానం ఇప్పటికీ అలానే ఉంది! అయితే.. కనుబొమ్మలు ఉన్నాయని.. దాన్ని శుభ్రం చేసే క్రమంలో అవి కనిపించకుండా పోయాయని చెబుతుంటారు. ఇలాంటి మోనాలిసా భారతీయ స్త్రీ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశాడు రాంచీకి చెందిన ఓ విద్యార్థి.. వెంటనే ఆచరణలో పెట్టాడు!

అవును... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ - రాంచీకి చెందిన విద్యార్థి రాశి పాండె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ని ఉపయోగించి ఇటాలియన్ కళాకారుడు లియోనార్డో డావిన్సీ మాస్టర్ పీస్ మోనాలిసా కు సంబంధించిన భారతీయ వెర్షన్ ను రూపొందించారు. దీనికి సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

ఈ మోనాలిసా కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెర్షన్ లో ఆమె తలపై దుపట్టాతో సంప్రదాయ భారతీయ దుస్తులను ధరించి.. చెవి పోగులు, నెక్లెస్ ను ధరించి ఉంది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. ఈ ఫోటోకి నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News