48 లక్షల పెళ్లిళ్లు.. రూ.6 లక్షల కోట్లు..!

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి తంతు ఒక్కసారే జరుగుతుంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు కావడం.. రెండో పెళ్లికి సిద్ధం కావడం.. చూస్తుంటాం

Update: 2024-11-04 08:10 GMT

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి తంతు ఒక్కసారే జరుగుతుంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు కావడం.. రెండో పెళ్లికి సిద్ధం కావడం.. చూస్తుంటాం. అయితే.. మొదటి సారి చేసినంత ఆర్భాటంగా రెండో పెళ్లిని చేసుకోరు. అందుకే.. జీవితంలో ఒక్కసారి జరిగే తంతు కాబట్టి అప్పు చేసి అయినా గ్రాండుగా చేసుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు.

అయితే.. పెళ్లిళ్ల ట్రెండులోనూ చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే వారం రోజుల పాటు ఉన్నంతలో ఆర్భాటంగా జరిపేవారు. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్. పెళ్లి ఎంత గ్రాండుగా చేసుకుంటే అంత ఫ్రస్టేజీ అని ఫీలవుతున్నారు. ఇందుకు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడుతున్నారు. అందులోభాగంగానే పెళ్లికి ముందే ఫొటో షూట్, కవర్ సాంగ్, లైవ్ వీడియోలంటూ రకరకాల ట్రెండ్స్ వచ్చాయి. పెళ్లికి ముందే వీటికే లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. దుస్తులు, ఆభరణాలు ఒకప్పటిలా లేవు. వాటి ధరలూ ఒకప్పటిలా లేవు. బంగారం ధరల గురించి ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితులే లేవు. వీటితోపాటు ఫర్నిచర్, డీజే సౌండ్స్, బ్యాండ్, ఇన్విటేషన్స్, టపాసులు వగైరా ఖర్చులు ఎన్నెన్నో. ఇంక విందు అదనం. డెకరేషన్స్, ఫంక్షన్ హాల్స్‌కు కూడా తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారు.

ఇటీవల దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో వివాహతంతును చూశాం. కొన్ని వేల కోట్ల ఖర్చుతో తన కొడుకు పెళ్లిని చేశాడు. ఒకవిధంగా చెప్పాలంటే దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగానూ నిలిచింది. భగవంతుల పెళ్లి భూలోకంలో జరుగుతున్నట్లుగా అనిపించింది. ఇలా.. ఎవరికి వారుగా పెళ్లిని గ్రాండుగా చేసుకోవాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు దేశం ఖరీదైన వివాహ వేడుకల కోసం సిద్ధమైంది. రాబోయే రెండు నెలల్లోనే భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. సుమారుగా 48 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ పెళ్లిళ్ల ఖర్చు అక్షరాల రూ.6 లక్షల కోట్లు అని అంచనా వేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలో జరిగే పెళ్లిళ్ల కోసమే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారంటే.. ఏడాది మొత్తంలో జరిగే పెళ్లిళ్ల ఖర్చు ఇంకా ఎలా ఉంటోందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News