యూఎస్ లో భారత విద్యార్థిపై బహిష్కరణ వేటు.. వాడికి ఈ శాస్తి జరగాల్సిందే

పూర్తి స్కాలర్ షిప్ కోసం ఎవరూ పాల్పడని దారుణానికి తెర తీశారు. తన తండ్రి చనిపోయినట్లుగా ఫేక్ స్టోరీని అల్లి.. ఏకంగా తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సైతం క్రియేట్ చేశాడు.

Update: 2024-06-29 04:10 GMT

తప్పులు కొందరు చేస్తారు. మరికొందరు.. క్షమించలేని తప్పులకు పాల్పడుతుంటారు. ఇప్పుడు చెప్పే భారత విద్యార్థి ఆ కోవకు చెందిన వాడు. అబద్ధాలు.. అసత్యాలతో చుట్టూ ఉన్న వారిని నమ్మించి మోసం చేయటమే కాదు.. ఫేక్ పత్రాలతో అమెరికా వర్సిటీ ఆడ్మిషన్ సంపాదించటమే కాదు.. స్కాలర్ షిప్ కోసం తండ్రి చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాల్ని క్రియేట్ చేసిన ఘనుడు.

ఇంతా చేసి.. తాను చేసిన ఎదవ పనుల గురించి సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకున్న వీడిపై అరుదైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికా నుంచి బహిష్కరణ వేటు వేసి.. త్వరలోనే భారత్ కు తిరిగి పంపించనున్నారు. సంచలనంగా మారిన ఈ భారత విద్యార్థి ఎవరు? అసలేం జరిగిందన్నది చూస్తే..

మనదేశానికి చెందిన విద్యార్థి గత ఏడాది ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహీలో ఆడ్మిషన్ పొందాడు. ఇందుకోసం తప్పుడు పత్రాల్ని క్రియేట్ చేశాడు. చివరకు టెన్త్ సర్టిఫికేట్లను సైతం తప్పుగా క్రియేట్ చేశాడు. పరీక్షా ఫలితాల్ని ఫోర్జరీ చేసి.. పూర్తి స్కాలర్ షిప్ కోసం ఎవరూ పాల్పడని దారుణానికి తెర తీశారు. తన తండ్రి చనిపోయినట్లుగా ఫేక్ స్టోరీని అల్లి.. ఏకంగా తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సైతం క్రియేట్ చేశాడు. ఇంత చేసిన అతను.. తాను చేసిన ఘనకార్యాల గురించి గొప్పగా సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టేవాడు.

Read more!

అబద్ధాలతో నా జీవితం మొత్తాన్ని నిర్మించుకున్నానంటూ తన గురించి చెప్పుకుంటూ.. తాను చేసిన ఎదవ పనుల గురించి గొప్పలు చెప్పుకుంటూ పోస్టులు పెట్టాడు. కాలేజీలో ఆడ్మిషన్ కోసం తాను చేసిన తప్పుడు పనులు.. స్కాలర్ షిప్ కోసం పరీక్షల్లో మోసాలు.. చదవుపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేని విషయాలతో పాటు.. తప్పుడు ఇంటర్న్ షిప్ ల గురించి అందులో వివరించాడు. ఇతగాడి దారుణాలు విశ్వవిద్యాలయానికి కంప్లైంట్ల రూపంలో వెళ్లాయి.

దీనిపై స్పందించిన వర్సిటీ అధికారుల నిర్ణయంతో అతన్ని జూన్ 12న అరెస్టు చేశారు. అతను చేసిన తప్పులకు దాదాపు ఇరవై ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అయితే.. వర్సిటీ అధికారుల అభ్యర్థనను అతడిపై బహిష్కరణ వేటు వేసి.. అతన్ని తిరిగి భారత్ కు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో అతడ్ని అమెరికా నుంచి తిరిగి పంపేస్తున్నారు. స్కాలర్ షిప్ కోసం కన్నతండ్రిని ‘చంపేసిన’ ఇలాంటి వాడిపై మన దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి.. తగిన రీతిలో శిక్షించాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News

eac