21 మంది విద్యార్థుల డిపోర్ట్... కారణంలో కన్ ఫ్యూజన్ క్లియర్!

డీపోర్టేషన్‌ అయిన విద్యార్థులు చెప్తున్న సమాచారం ప్రకారం.. వాళ్లందరినీ ఇమిగ్రేషన్‌ చెకింగ్స్‌ తర్వాత ఇరుకు గదుల్లో పెట్టి ఎవరితో మాట్లాడకుండా నిర్బంధించేశారట.

Update: 2023-08-18 07:28 GMT

పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురయింది.ఎన్నో ఆశలతో అగ్రారాజ్యలో అడుగుపెట్టిన వారు తిరిగి ఇండియాకు పంపబడ్డారు! ఇందులో భాగంగా సుమారు 21మంది విద్యార్థులను రిటన్ ఫ్లైట్ ఎక్కించేశారు యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు. అయితే ఇందుకు గల కారణంలో కన్ ఫ్యూజన్ క్లియర్ గా ఉందని తెలుస్తుంది.

అవును... వీసా ప్రాసెస్ అంతా పూర్తయ్యింది, యూనివర్సిటీ నుంచి అడ్మిషన్‌ కూడా ఖరారైంది, ఇతర అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ యూఎస్‌ లో ల్యాండ్‌ అయిన భారతీయ విద్యార్థులను సుమారు 16గంటల పాటు రకరకాలా ప్రశ్నలు, పరిశీలనల అనంతరం రిటన్ ఫ్లైట్ ఎక్కించేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీనికి సంబంధించిన అసలు కారణం అధికారులు స్పష్టంగా చెప్పలేదని అంటున్నారు. ఈ విషయాలపై పలువురు విద్యార్థులు జరిగిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా... సరైన కారణం చెప్పకుండానే డీపోర్టేషన్‌ చేశారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీపోర్టేషన్‌ అయిన విద్యార్థులు చెప్తున్న సమాచారం ప్రకారం.. వాళ్లందరినీ ఇమిగ్రేషన్‌ చెకింగ్స్‌ తర్వాత ఇరుకు గదుల్లో పెట్టి ఎవరితో మాట్లాడకుండా నిర్బంధించేశారట. ఎదురుప్రశ్నించిన వారిని జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారంట. ఈ సమయంలో సుమరు 16 గంటలపాటు పేరెంట్స్‌ తో సైతం మాట్లాడనివ్వలేదని చెబుతున్నారు.

ఈ సమయంలో వారు తీవ్రమైన ఆందోళనలు లోనైనట్లు తీవ్ర ఆవేదనతో చెప్తున్నారు. ఇదే క్రమంలో భారతీయ విద్యార్థుల సెల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లను సైతం యూఎస్ అధికారులు సీజ్‌ చేశారని అంటున్నారు. అనంతరం సరైన కారణం కూడా చెప్పకుండానే డిపోర్టేషన్ చేశారంట.

అయితే గుర్తింపు పొందిన వర్సిటీలో అడ్మిషన్‌ పొందినా కూడా ఇలా కొత్త కష్టాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సెయింట్‌ లూయిస్‌, డకోటా వంటి ప్రముఖ వర్సిటీల్లో అడ్మిషన్లు పొందినా కూడా.. అస్పష్టమైన వివిధ కారణాలతో కొందరు విద్యార్థుల్ని డీపోర్టేషన్‌ చేస్తున్నారట ఇమిగ్రేషన్ అధికారులు.

ఈ సందర్భంగా వీసా ప్రిపరేషన్‌ కి సంబంధించి కన్సల్టెంట్‌ లతో విద్యార్థులు చేసిన వాట్సప్‌ చాట్‌ ను పరిశీలించిన అధికారులు... ఈ సమయంలో వారి సోషల్‌ మీడియా ఖాతాలను సైతం పరిశీలించారట. అనంతరం కొందర్ని వెనక్కు పంపేశారు.

దీంతో... నిబంధనల విషయంలో ఎంత కఠినంగా ఉన్నా.. కనీసం తమకు కారణం కూడా చెప్పకపోవడం పట్ల తిరిగి వచ్చేసిన విద్యార్థులు అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఫేక్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారంటే అందులో అర్ధం ఉంది కానీ.. ఇప్పుడు ప్రముఖ వర్సిటీల్లో సీటు వచ్చినా కూడా వెనక్కి పంపేస్తుండడమే ఆందోళన కలిగిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క చాలా మంది విద్యార్థులు యూఎస్ వెళ్లాక పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారనేది తెలిసిన విషయమే. దీంతో... భారతీయ విద్యార్థుల వల్ల తమకు పార్ట్ టైమ్ జాబ్ దొరకడం లేదని స్థానికులకు ఆరోపించారు. ఈ విషయం ఒకసమయంలో అక్కడ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

దీంతో... పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆంక్షాలు విధించారని తెలుస్తోంది. ఫలితంగా... ఎయిర్ పోర్టులో దిగిన విద్యార్థుల వాట్సాప్, మెయిల్ చెక్ చేస్తుంటారట. వారి చాట్ లో పార్ట్ టైమ్ జాబ్ గురించి సమాచారం ఉంటే వారిని తిరిగి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో కొంతమంది భారతీయ విద్యార్థులు అక్కడున్న యూనివర్సిటీల గురించి పూర్తిగా తెలియకుండా నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారనే వాదన ఆన్ లైన్ వేదికగా వినిపిస్తోంది. తీరా అక్కడి వెళ్లకా.. అవి నకిలీ యూనివర్సిటీలని తేలడంతో వారు ఇండియాకు దిరిగి రావాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో... భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు.. ముందే టోఫెల్, జీ.ఆర్‌.ఈ వంటి పరీక్షలు రాస్తారు.. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి.. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌ గా చూపిస్తారు.

అయితే దీనికోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు.. ఇదే సమయంలో ఇక్కడ ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు.. అయితే ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయని తెలుస్తోంది.

ఏది ఏమైనా... ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది! కాగా... ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్‌ అయిన విద్యార్థులు తిరిగి ఆ దేశ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి 5 ఏళ్ల దాకా అనర్హులు అవుతారు.

మరోపక్క ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News