ఈ భారత విస్కీ అంటే మనసు పారేసుకుంటున్నారంట!
దీంతో... భారత విస్కీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నాయి నివేదికలు.
భారతదేశ మద్యానికి విదేశాల్లో బాగా డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. ఇక్కడి విస్కీ అంటే అక్కడ మనసు పారేసేసుకుంటున్నారంట మద్యపాన ప్రియులు. దీంతో... భారత విస్కీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నాయి నివేదికలు. ఇందులో భాగంగా 2024 ప్రథమార్ధంలో విస్కీ ఎగుమతులు 26 శాతం పెరిగాయని చెబుతున్నారు.
అవును... కొంతమంది మద్యపాన ప్రియులకు ఒక బ్రాండ్ కి కనెక్ట్ అయితే.. ఇక దానికొసం పడి సచ్చిపోతారని చెబుతుంటారు. అది దొరికే వరకూ అవిరామంగా ప్రయత్నిస్తుంటారని అంటుంటారు. మరి అలాంటి రుచి, మత్తు ఇండియన్ విస్కీలో లభిస్తుందో ఏమో కానీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత విస్కీ షిప్ మెంట్ లు 26 శాతం పెరిగాయి.
తాజాగా వెళ్లడవుతున్న విశ్లేషణల ప్రకారం... భారతదేశం 2024 మొదటి ఆరు నెలల్లో 78.5 మిలియన్ డాలర్ల విలువైన స్పిరిట్ ను రవాణా చేసింది. ఈ మొత్తం విస్కీ ఎగుమతుల్లో బ్లెండెడ్ విస్కీ 37 శాతం పెరిగింది. ఇదే సమయంలో ప్రీమియర్ లిక్కర్ ఎగుమతులు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అంతకు ముందు ఏడాది కంటే రెండింతలు పెరిగి 6.3 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన బ్రువర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, పరిశ్రమల నిపుణులు వినోద్ గిరి... భారతీయ సింగిల్ మాల్ట్ లు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతున్నాయని.. భారతీయ సింగిల్ మాల్ట్ ల గురించి చాలా ఎక్కువ అవగాహన ఉందని.. తద్వారా కొత్త మార్కెట్ ను కనుగొంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ పోటీల్లోనూ భారతీయ విస్కీలు అవార్డులు కొల్లగొడుతున్నాయని చెబుతున్నారు.