ఉత్తర కొరియాతో దౌత్యం... భారత్ ఇంట్రస్టింగ్ మూవ్!!

అవును... ఉత్తర కొరియాతో గౌత్యపరమైన విషయాల్లో భారత్ సైలంట్ గానే పనిచేసుకు పోతుంది.

Update: 2024-12-18 04:24 GMT

ప్రపంచ వ్యాప్తంగా మధ్య, పశ్చిమాసియా, యూరప్ లలో యుద్ధాలతో హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే! ఈ సమయంలొ భారత్ తన యక్ట్ ఈస్ట్ విధానంతో.. ఆగ్నేసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకొవడంతో పాటుగా.. కొరియా ద్వీపకల్పంలోనూ తన విధానం పట్ల సైలెంట్ గా కేర్ ఫుల్ గా పని చేస్తోందని అంటున్నారు.

అవును... ఉత్తర కొరియాతో గౌత్యపరమైన విషయాల్లో భారత్ సైలంట్ గానే పనిచేసుకు పోతుంది. ఇందులో భాగంగా... 2021 జూలైలో ప్యోగ్యాంగ్ లోని తన రాయబార కార్యలయాన్ని సైలెంట్ గా మూసేసింది. ఆ సందర్భంగా... రాయబారి అతుల్ మల్హారీతో కలిసి మొత్త సిబ్బంది మాస్కో మీదుగా ఢిల్లీ తిరిగి వచ్చారు.

దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ... మొత్త స్టాఫ్ అంతా ఎందుకు వెనక్కి వచ్చారనే విషయంపై జర్నలిస్టుల ప్రశ్నలకు సమాదానంగా.. కోవిడ్-19 ని కారణంగా చెప్పింది. అప్పటి నుంచి ప్యోగ్యాంగ్ దౌత్య మిషన్ పై ఎలాంటి అప్ డేట్స్ లేవనే చెప్పాలి. ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచిపోయిన పరిస్థితి!

ఈ నేపథ్యంలో... భారతదేశం.. ప్యోగ్యాంగ్ లోని తన రాయబార కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుందని.. కొద్ది రోజుల్లోనే టెక్నికల్ స్టాఫ్, దౌత్య సిబ్బందితో కుడిన టీమ్ ఉత్తర కొరియాకు పంపబడిందని చెబుతు ‘ది ట్రిబ్యూన్’ నివేధిక వెల్లడించింది.

ఇదే సమయంలో... సుమారు మూడున్నరేళ్లకు పైగా మూతపడిన ఎంబసీని ముందుగా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉందని.. అనుమానాస్పద గూఢచార సాంకేతికతలకు ప్రసిద్ది చెందిన ఉత్త కొరియాలోని ఉన్న కార్యాలయ భవనాన్ని పూర్తిగా డీబగ్ చేయాల్సి ఉందని.. అందువల్ల కొత్త రాయబార కార్యాలయంలో పనులు ప్రారంభమవ్వడానికి సుమారు నెలల సమయం పట్టొచ్చని తెలిపింది.

Tags:    

Similar News