ఢిల్లీలో టెన్షన్: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు హెచ్చరికలు రావడంతో ఆకాశంలోకి ఎగిరిన విమానాన్ని అత్యవస రంగా కిందకి దింపేశారు
ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు హెచ్చరికలు రావడంతో ఆకాశంలోకి ఎగిరిన విమానాన్ని అత్యవస రంగా కిందకి దింపేశారు. ఈ రోజు(మంగళవారం) తెల్లవారు జామున 5 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని వారణాసికి 6E2211 నెంబరు గల విమానం ప్రయాణికులతో బయలు దేరింది. రన్‌వేపై టేకాఫ్ తీసుకుని నింగిలోకి ఎగిరిన కొన్నినిముషాలకు విమనంలో బాంబు పెట్టినట్టు హెచ్చరికలు వచ్చాయ.
విమాన సిబ్బంది.. వాష్ రూమ్‌లను తనిఖీ చేస్తున్న సమయంలో `విమానంలో బాంబు ఉంది` అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్‌ను గుర్తించారు. వెంటనే క్రూ సిబ్బందిని అలెర్ట్ చేయడంతోపాటు.. విమానాశ్రయ అధికారులకు కూడా.. సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన విమానాన్ని కిందకు దింపేశారు. దీంతో పాటు మైకులోఅనౌన్స్ చేయడంతో ప్రయాణికులు.. బిత్తర పోయారు. హడావుడిగా విమానం ల్యాండ్ అయ్యే సరికే.. కిందికి దిగేందుకు తోసుకున్నారు.
మరోవైపు.. సాధారణ మార్గాలు కొద్ది సేపటి వరకు తెరుచుకోవడంతోపలువురు ప్రయాణికులు అత్యవసర మార్గాల నుంచి తోసుకుంటూ కిందికి దిగిపోయారు. ఈ ఘటనలో పలువురు రన్ వైపైకి జారి పడిపోయారు. మరికొందరికి తోపులాటలో గాయాలయ్యారు. మొత్తానికీ అందరూ దిగిపోయే సరికి.. బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాశ్రయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే.. బాంబు ఉన్న జాడ వారు గుర్తించలేక పోయారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విమానాశ్రయంలో కొన్ని విమానాలను ల్యాండింగ్, టేకాఫ్‌లు ఆపేశారు. మొత్తంగా రెండు గంటల పాటు విమానాశ్రయంలో ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే.. బాంబు లేదని అధికారులు నిర్దారించిన తర్వాత.. ఉదయం 8 గంటలకు యధావిధిగా విమాన సర్వాలు ప్రారంభించారు. బాంబు బెదిరింపులు వచ్చిన ఇండిగో విమానాన్ని మాత్రం నిలిపివేశారు. ఈ విమానంలో ప్రయాణించాల్సిన వారిని వేరే విమానంలో తరలించారు.