సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు హ్యాపీ న్యూస్.. ఆ క్యాంపస్‌లో 17వేల కొత్త ఉద్యోగాలు..

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని చేసుకుంది.

Update: 2025-01-23 09:14 GMT

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని చేసుకుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇన్ఫోసిస్ మధ్య ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో కొత్తగా 17వేల మందికి ఉద్యోగాలను కల్పించేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. హైటీ హబ్ గా తెలంగాణ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫోసిస్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా పోచారంలోని తమ ఐటీ క్యాంపస్ విస్తరణ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఇన్ఫోసిస్ సంస్థ తీసుకెళ్లగా.. దానికి పూర్తి సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సందర్భంగా ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంఘ్ రాజ్కా, తెలంగాణ ఐటి, శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ విస్తరణ ప్రక్రియలో భాగంగా 750 కోట్ల రూపాయల పెట్టుబడిని ఇన్ఫోసిస్ దశలవారీగా పెట్టనుంది. ఇందులో భాగంగా ఐటీ భవనాల నిర్మాణంతోపాటు ఉద్యోగాలు కల్పన ఉంటుంది. ఈ భవనాల్లో మొదటి దశలో పదివేల మందికి వస్తే కల్పించేలా నిర్మించాలని భావిస్తున్నారు. రానున్న రెండు మూడేళ్లలో ఈ భవన నిర్మాణాల ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో 35 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇన్ఫోసిస్ సంస్థకు దేశంలోనే ఉన్న కీలక క్యాంపస్‌లో ఇది ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే అతిపెద్ద క్యాంపస్‌లో ఇది అత్యంత కీలకమైనదిగా చెబుతారు. మరో 17 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా విస్తరణకు ఇన్ఫోసిస్ ముందుకు రావడంతో తెలంగాణలో ఐటీ రంగ విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ గమ్యస్థానంగా తెలంగాణను మార్చడంలో ఈ ఒప్పందం కీలకము కానుంది అని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంకేతిక రంగం అభివృద్ధికి తోడ్పాటున అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానానికి అనుగుణంగా ఈ చర్య తీసుకోబడిందని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక పుత్రులను పెంపొందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిభను పెంపొందించడం, అవకాశాలను సృష్టించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం కోసం తాము ఎంతగానో కృషి చేస్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తమ భాగస్వామ్యం ముందుకెళ్లేలా చేయడంలోనూ, తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోవడంలోనూ ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంఘ్ రాజ్క పేర్కొన్నారు. ఈ విస్తరణతో ఇన్ఫోసిస్ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగానికి మరింత ఉత్తేజితాన్ని తీసుకువచ్చేందుకు ఉపకరిస్తుందని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ ఒప్పందం ద్వారా కీలక పురోగతిని సాధించినట్లు అయిందని పలువురు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News