ఇన్ స్టాగ్రామ్ కీలక నిర్ణయం!
అయితే... టెక్నాలజీలో మంచి పక్కనే చెడు కూడా పెద్ద సమస్యగా ఉంటుందని అంటున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ కి ఇటీవల కాలంలో ప్రధానంగా యువతలో ఫుల్ ఫాలోయింగ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం నేటి జనరేషన్ యువతను అట్రాక్ట్ చేసే ఫీచర్లు అని అంటున్నారు. అయితే... టెక్నాలజీలో మంచి పక్కనే చెడు కూడా పెద్ద సమస్యగా ఉంటుందని అంటున్నారు. దీనికి ఇన్ స్టా అతీతమేమీ కాదు.
ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువవుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీంతో ఈ విషయంపై ఆయా దేశాల ప్రభుత్వాలు స్పందించే లోపు మెటానే ముందు జాగ్రత్తలకు దిగింది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించాలని నిర్ణయించింది. దీనివల్ల తప్పుడు క్రెడెన్షియల్స్ ని సులువుగా గుర్తించొచ్చని అంటున్నారు.
అవును... సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మంచి ఎంత ఉంటుందో.. దానికనుగుణంగా చెడు కూడా ఉంటుందని అంటారు. ప్రధానంగా చిన్నారులు, మైనర్లు తప్పుదోవ పట్టే అవకాశాల్లో ఒకటైన అసభ్యకరమైన కంటెంట్ పెను సమస్యగా మారుతుందని అంటున్నారు. దీంతో... ఈ సమస్యపై మెటా నడుం బిగించింది.
ఇందులో భాగంగా... తక్కువ వయస్సు ఉన్నవారిని గుర్తించేందుకు.. తప్పుడు వివరాలు పొందుపరిచి లాగిన్ అయినవారిని గుర్తించేందుకు కంకణం కట్టుకుందని, ఇప్పటికే పని మొదలుపెట్టిందని అంటున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ఉపయోగించనున్నారు. ఈ మేరకు మెటా కీలక ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా... ఇన్ స్టాలో లాగిన్ అయిన యూజర్ వయసును ఏఐ టూల్ అంచనా వేస్తోందంట. ఒక వేళ యూజర్ మైనర్ (18 ఏళ్ల లోపు) అయితే వెంటనే ఆ అకౌంట్ ను టీన్ అకౌంట్ గా మార్చేస్తుందంట. తదనుగుణంగా ప్రైవసీ సెట్టింగ్స్ అటోమెటిక్ గా మారిపోతాయని.. అదే విధంగా.. ఏ యూజర్ ఎలాంటి కంటెంట్ ను యాక్సిస్ చేయొచ్చనేది ఏఐ నిర్ణయిస్తుందని చెబుతున్నారు.
ఈ ఫీచర్ ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇన్ స్టా లో అడల్ట్ కంటెంట్ ను కంట్రోల్ చేయడంతో పాటు, ఈ ఏఐ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని మెటా అభిప్రాయపడింది.