Begin typing your search above and press return to search.

ఐపాక్ రిషి...సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడా ?

వైసీపీ జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన రుషి సింగ్ ఆయనకు అన్నీ చేశారు అని అంటారు. ఈయనది రాజస్థాన్ స్టేట్.

By:  Tupaki Desk   |   14 Sep 2024 2:30 PM GMT
ఐపాక్ రిషి...సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడా ?
X

ఐపాక్ అంటే మొదట గుర్తుకు వచ్చేది పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. ఆయన శిష్యులు కూడా తరువాత కాలంలో దానిని టేకోవర్ చేసి నడుపుతూ వచ్చారు. 2019లో వైసీపీని ఐపాక్ ని పీకే నడిపిస్తే భారీ విజయం దక్కింది. ఇక 2024 లో ఐపాక్ ని పీకే శిష్య్డు రిషి నడిపించారు ఘోర పరాజయం ఆ పార్టీని పలకరించింది.

ఆ తరువాత ఐపాక్ తో రిషి కన్సెల్టెన్సీని వైసీపీ వదిలేసుకుంది. అయితేనేమి రిషి బాగానే అయిదేళ్లలో సొమ్ము చేసుకున్నాడు అని టాక్ నడచింది. సీన్ కట్ చేస్తే ఇపుడు సాఫ్ట్ వేర్ కంపెనీకి ఆయన అధిపతి అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

అసలు ఏమిటి ఇదంతా అని కూడా అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఐప్యాక్ రిషి కధ చూస్తే ఆయన పీకే కి రైట్ హ్యాండ్ గా ఉంటూ వచ్చారు. ఐపాక్ లో సైతం ముఖ్య వ్యక్తిగా రిషి సింగ్ బాగా ప్రాచుర్యం పొందారు.

వైసీపీ జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన రుషి సింగ్ ఆయనకు అన్నీ చేశారు అని అంటారు. ఈయనది రాజస్థాన్ స్టేట్. ఒకనాడు పీకేతో నడచి ఆయనతోనే అంతా అన్నట్లుగా ఉన్న రిషి తరువాత ఆయనతోనే విభేదించాడు. అలా వైసీపీకి జగన్ కి టచ్ లోకి వచ్చాడు. అయిదేళ్ల పాటు వైసీపీకి ఐపాక్ సేవలు అందించాడు.

వైసీపీకి రిషి వచ్చిన తరువాత రాజకీయ జాతకం మొత్తం రివర్స్ అయింది. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తే కేవలం 11 సీట్లతో పడుక్కోబెట్టిన వాడు రిషి సింగ్ అని అంతా అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే రిషి సింగ్ వైసీపీ క్యాడర్ ని సర్వనాశనం చేశాడు అని కూడా అంటున్నారు.

ఈ రిషి సింగ్ ఎంతటి ఘనుడు అంటే వైసీపీ మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వనంత. అంటే కార్యకర్తల చమట కష్టంతో పదేళ్ల శ్రమతో వారి కలలతో అధికారంలోకి వచ్చిన వైసీపీని పూర్తిగా నాశనం చేసిన రిషి సింగ్ జగన్ ని మాత్రం నమ్మించి బాగానే దగ్గర అయ్యారు అని వైసీపీలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.

ఆయనను కలవాలన్నా అపాయింట్మెంట్ కావాలన్నా నెల రోజుల ముందుగా చెప్పాలంట. వైసీపీలో అధినేత ఇచ్చిన చనువుతో అలా అల్లుకుని పోయి ఏకంగా వైసీపీలొనే అంత పెద్ద స్థాయిని రిషి అనుభవించాడు అంటే ఆలోచించాల్సిందే.

మొదట ఇపాక్ ని ముంచేసిన రిషి సింగ్ ఆ తరువాత ఏకంగా వైసీపీని కూడా నిండా ముంచేశాడు అని అంటున్నారు. ఆయన వైసీపీకి ఒక విధంగా చేటుగా దాపురించారు అని పార్టీలో కరడు కట్టిన వారు అంతా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆయన సొంత బాగు కోసం పచ్చని పార్టీనే మండించేశాడు అని కూడా అంటూ ఉంటారు.

ఎక్కడ జగన్ ఎలా ఉండే జగన్. ఈ రోజు ఏమీ కాకుండా అయిపోయారు. అంతలా జగన్ ని కోలుకోలేని దెబ్బ ఈ రిషి సింగ్ తీశారు అని వైసీపీలో అనుకుంటున్న పరిస్థితి ఉంది. వైసీపీ గుట్టుమట్లు అన్నీ మోసుకెళ్ళి టీడీపీకి వాటిని చేరవేస్తూ ఆ పార్టీతో రిషి సింగ్ కుమ్మక్కు అయ్యారని కూడా ప్రచారం సాగుతోంది

ఏ మాత్రం రాజకీయ వ్యూహాలు లేని ఈ రిషి సింగ్ ని జగన్ ఎందుకు నమ్మారు అన్నదే ఎవరికీ ఈ రోజుకీ అర్ధం కాని విషయం అని అంటూంటారు. వైసీపీలో బ్రహ్మాండమైన క్యాడర్ ని లేకుండా కాకుండా చేసి లీడర్లలోనూ నైతిక స్థైర్యం దెబ్బ తీసి మొత్తానికి దారుణమైన ఓటమిని తెచ్చిపెట్టిన రిషి సింగ్ మాత్రం తాను పచ్చగానే ఉన్నారని అంటున్నారు.

ఇక టీడీపీతో రిషి సింగ్ కుమ్మక్కు అయ్యారు అన్నది బలం చేకూర్చే వార్తలకు ఆధారాలు ఏంటి అంటే టీడీపీకి సలహాదారుగా చేరిన పీకేకి ముందే తెలుసు వైసీపీ ఓటమి పాలు అవుతుందని అను గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ భారీ నష్టం మూటకట్టుకుంటుంది అని పీకేకి ఎలా తెలుసు అంటేనే రిషి సింగ్ మీదనే అందరి చూపులూ వెళ్తున్నాయి అని అంటున్నారు.

ఇలా వైసీపీని జగన్ ని ముంచేసిన రిషి సింగ్ మాత్రం హాయిగా నోయిడాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని కొని హ్యాపీగా బిజినెస్ ఫీల్డ్ లో ఉంటున్నారు అని అంటున్నారు. కొన్ని కోట్లు సంపాదించిన రిషి పొలిటికల్ కన్సెల్టెన్సీ అనే బిజినెస్ ని వదిలేసినట్లే అని అంటున్నారు.

అయినా ఇంత నేలబారుడు ఆలోచనలతో ఉన్న రిషి సింగ్ ని ఎవరు పెట్టుకుంటారు అని కూడా అంటున్నారు. జగన్ మాత్రమే నమ్మి మోసపోయారు అని అంటున్నారు. రిషి సింగ్ జగన్ ఇచ్చిన ఫ్రీడం ని పూర్తిగా వాడుకుని పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాడని అంటున్నారు. ఇంతటి బ్యాడ్ ట్రాక్ రికార్డ్ కలిగిన రిషి సింగ్ ఇక జీవితంలో పొలిటికల్ కన్సల్టెంట్ గా ఎందుకు ముందుకు వస్తాడు, వచ్చినా ఎవరు తీసుకుంటారు అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.

ఏది ఏమైనా ఇలాంటి వారిని నమ్ముకుని మంచి పార్టీని కోరి పాడుచేసుకున్న వైసీపీ అధినాయకత్వానిదీ ఇందులో తప్పు ఉంది. ఎవరో ఏదో వచ్చి చెబితే దానిని గుడ్డినా నమ్మడం, పార్టీకి ప్రాణం పెట్టే లీడర్స్ ని క్యాడర్ ని పట్టించుకోకపోవడం వల్లనే వైసీపీ ఒక భారీ మూల్యం చెల్లించింది. రిషి సింగ్ కి ఏమి పోయింది సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ అయ్యాడు. మరి వైసీపీ మళ్లీ లేచి నిలబడగలదా అన్నదే బిగ్ క్వశ్చన్. మొత్తానికి పొలిటికల్ కన్సల్టెంట్ అన్న పదానికే మాయని మచ్చగా రిషి సింగ్ మిగిలారు అని కూడా అంటున్నారు.