ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్... జైశంకర్ కీలక వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-02 11:30 GMT

ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ లోని థింక్ తాంక్ కార్నేగీ ఎండోమెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఈ వ్యవహారంపై స్పందించారు.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం పుష్కలంగా ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో... మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంఘర్షణపై భారతదేశం ఆందోళన చెందుతోందని జై శంకర్ అన్నారు. ఈ ఆందోళనలో భాగంగా... చర్చలు, దౌత్యం ద్వారా భారత్ ఈ విషయంలో నిమగ్నమై ఉండొచ్చని తెలిపారు.

ఇదే సమయంలో... కష్ట సమయాల్లో కమ్యునికేషన్ ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయకండని చెప్పిన జై శంకర్... చెప్పవలసినవి ఉంటే అవన్నీ మనం చేయగలిగినవి అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం గురించి మాత్రమే భారత్ ఆందోళన చెందడం లేదని జై శంకర్ తెలిపారు.

లెబనాన్ విషయంలో మాత్రమే కాకుండా హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఘర్షణలు విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 7ని తాము తీవ్రవాద దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని తాము అర్ధం చేసుకున్నామని అన్నారు.

అయితే... ఏ దేశమైనా తమపై జరిగిన దాడిపై ప్రతిస్పందించే విషయంలో అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణలోకి తీసుకొవాలని.. పరులకు ఎలాంటి నష్టం కలగకుండా చుసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే... చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని తాను భావిస్తున్నట్లు జై శంకర్ తెలిపారు.

Tags:    

Similar News