మీకు మూడింది: పోటాపోటీగా ఇజ్రాయెల్.. ఇరాన్ అధినేతల వార్నింగ్

చూస్తుండగానే పరిస్థితులు చేజారిపోతున్న పరిస్థితి. నిప్పుల గుండంగా పశ్చిమాసియా మారనుంది.

Update: 2024-10-02 09:54 GMT

చూస్తుండగానే పరిస్థితులు చేజారిపోతున్న పరిస్థితి. నిప్పుల గుండంగా పశ్చిమాసియా మారనుంది. గత ఏడాది ఇజ్రాయెల్ మీద హమస్ దాడి చేయటం.. వందల మందిని అమానుషంగా చంపేయటంతో మొదలైన ఘర్షణ అంతకంతకూ విస్తరించటమే కాదు.. హమస్.. దానికి అండగా నిలిచే హెజ్ బొల్లా అధినాయకత్వాన్ని ఇజ్రాయెల్ అంతమొందించింది. దీనికి ప్రతిగా ఇరాన్ సీన్ లోకి రాగా.. ఆ తప్పు చేయొద్దని ఇజ్రాయెల్ హెచ్చరించింది.అయినప్పటికీ ఇరాన్ మంగళవారంరాత్రి వేళలో ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున క్షిపణుల దాడి చేయగా.. తమకున్న అత్యాధునిక సాంకేతితతో వాటిని అడ్డుకున్న పరిస్థితి ఇలాంటి వేళ.. రెండు దేశాల మధ్యన ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమతో ఘర్షణకు దిగొద్దని ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరిస్తే.. తమతో పెట్టుకోవటం ద్వారా ఇరాన్ పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అధినేతలు ఏమేం అన్నారు? అన్న విషయంలోకి వెళితే..

ఇరాన్ అధ్యక్షుడి సీరియస్ వార్నింగ్ లు ఇవే..

- ఇజ్రాయెల్ మీద మంగళవారం రాత్రి దాదాపు 200 వరకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా ఇజ్రాయెల్ వాటిని అడ్డుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇజ్రాయెల్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇరాన్ తో యుద్ధానికి తాము వ్యతిరేకమని ఇజ్రాయెల్ అధ్యక్షుడికి ఆ దేశ ప్రజలు తెలియజేయాలి.

- ఇరాన్ ప్రయోజనాలు.. పౌరుల రక్షణలో భాగంగానే దాడులు ప్రారంభించాం.

- ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని నెతన్యాహుకు తెలియజేయండి.

- ఈ దాడులు మాలో ఒక కోణం మాత్రమే. ఇరాన్ తో ఘర్షణకు దిగొద్దు.

- ఇజ్రాయెల్ పై మా దాడి ముగిసింది. ఇజ్రాయెల్ మరింత ప్రతీకారానికి పాల్పడకపోతే మా చర్య ముగిసినట్లే.

- ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభిస్తే మా ప్రతిస్పందన మరింత తీవ్రంగా.. శక్తివంతంగా ఉంటుంది.

ఇజ్రాయెల్ అధ్యక్షుడి సీరియస్ వార్నింగ్ ఇదే

- ఇరాన్ క్షిపణులతో దాడికి పాల్పడటాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రియాక్టు అయ్యారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని పేర్కొన్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు.

- ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడింది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

- ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి ఫెయిల్ అయింది.

- ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ తోనే ఇది సాధ్యమైంది. మాకు అండగా నిలిచిన అమెరికాకు ధన్యవాదాలు.

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ తీరును తీవ్రంగా తప్పు పట్టింది. తమ మద్దతు ఇజ్రాయెల్ కు ఉంటుందని తేల్చిన అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనే అంశంపై లోతైన చర్చలు జరుగుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. దాడి అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడితో తాను మాట్లాడినట్లు చెప్పిన బైడెన్.. ‘ఇరాన్ దాడి ఫెయిల్ అయ్యింది. ఎలాంటి ప్రభావం చూపలేదు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక ప్రమాదకరమైన దేశం. ఆస్థిరపరిచే శక్తి. ఇజ్రాయెల్ భద్రతకు వాషింగ్టన్ కట్టుబడి ఉంది’’ అని కమలా హారిస్ పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలుఉంటాయని ఇరాన్ ఆర్మీ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచే దేశాల కార్యకాలాపాలపై ఇరాన్ ఆర్మీ దాడులు చేస్తుందని హెచ్చరిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News